Singer Sushila : దాదాపు గా 60 దశబ్దాల పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో గానకోకిలగా సినిమా పాటలు పాడిన సింగర్ సుశీల గారు పుట్టింది ఆంధ్రప్రదేశ్ విజయనగరం. మ్యూజిక్ డిప్లొమా చేసిన సుశీల గారు మొదట ఆల్ ఇండియా రీడియోలో పనిచేసారు. అలానే కచేరిలు ఇచ్చేవారు. అలా కెరీర్ లో సాగుతున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరావు గారు కొత్త గొంతు కోసం వెతుకుతుండగా సుశీల గారిని సెలెక్ట్ చేసి ఆమెతో తొలిసారి 1950 లో తమిళ పాట పాడించారు. సుశీలమ్మ తన గాత్రంతో ఎన్నో సాధించారు. మిస్సమ్మ సినిమాలోని పాటలకు మంచి గుర్తింపు వచ్చి అటు తమిళం, ఇటు తెలుగు లో తిరుగులేని గాయనిగా మారారు. దాదాపు నలభై ఏళ్ళు అగ్ర గాయనిగా కొనసాగైనా సింగర్ సుశీల గారి వ్యక్తిగత జీవితం కెరీర్ గురించి ఆమె ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కొడుకు, మనవరాళ్ళ గురించి…
సుశీల గారి భర్త మోహన్ రావు గారు డాక్టర్ సుశీల గారి కెరీర్ విషయంలో ఆయన ఎంతో చొరవ చూపారు. ఆయన లేకపోతే ఇదంతా ఉండేది కాదు అంటూ సుశీల గారు ఆమె భర్త గురించి తెలిపారు. ఇక ఆయన 90 లో అనారోగ్య కారణాలతో మరణించారు. ఆ సమయంలో అమెరికాలో వైద్యం చేయించి 50 వేల డాలర్స్ ఖర్చుపెట్టి బైపాస్ సర్జరీ చేసినా వారం రోజులకే ఆయన మరణించారంటూ తెలిపారు సుశీల. ఇక కొడుకు ఒక్కడే పుట్టడం వల్ల చాలా ప్రేమ అంటూ తెలిపారు. ఇక కోడలు సంధ్య కూడా మంచి సింగర్ అంటూ తెలిపారు.

ఇక మానవరాళ్లు ఇద్దరూ రెండు కళ్ళలాంటి వారని, వారు లేకపోతే ఉండలేనంటూ తెలిపారు. పెద్ద మనవరాలు గిటారిస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి పనిచేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇక రెండో మానవరాలికి త్వరలో పెళ్లి చేయబోతున్నట్లు తాను ఒక ఐపీస్ ఆఫీసర్ ను పెళ్లిచేసుకోబోతోందని తెలిపారు. తనతో పాటే వెళ్తానని అక్కడే కొద్దిరోజులు ఉండాలనుకుంటున్నట్లు మానవరాళ్లు లేకపోతే కష్టంగా ఉంటుందంటూ తెలిపారు.



























