బిగ్ బాస్ 5 సీజన్ లో అన్నింటి కన్నా ముఖ్యంగా సిరి, షణ్ముఖ్ మధ్య రిలేషన్ పైనే ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ పైన అనేక రకాలుగా ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య హగ్గింగులు, కిస్సింగులు జనాల్లో బాగా ఫేమస్ అయ్యాయి.

అయితే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. వీరిద్దరి మధ్య ఇంకేదో ఉందని నెటిజన్లు, ఆడియన్స్ అనుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసి సిరి తల్లి శ్రీదేవి కూడా ఒకానొక సందర్భంలో సీరియస్ అయింది. బిగ్ బాగ్ ఆధ్యంతం కూడా సిరి, షణ్ముఖ్ మంచి ప్రెండ్స్ గా కనిపించారు.
ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు అండగా నిలిచారు. ఇదిలా ఉంటే సిరితో ఈ కెమిస్ట్రీనే షణ్ముఖ్ ను బిగ్ బాస్ ట్రోఫి నుంచి దూరం చేశాయని అనుకుంటున్నారు జనాలు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబుల్లో వీడియోలు, థంబ్ నెల్స్ చూసిన తర్వాత సిరి షాక్ అయింది. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్ నన్నెంతో మోటివేషన్ చేశారని చెప్పుకొచ్చింది సిరి.
తామెంటో తమ పార్ట్నర్లకు తెలుసని… వెల్లడించింది. అయతే తాము హగ్ చేసుకోవడం బయట రిసీవ్ చేసుకోలేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి గురించి కూడా స్పష్టతనిచ్చింది సిరి. సిరి లవర్ శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సార్లు సిరిని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశాడు. సిరి, షణ్ముఖ్ మధ్య రిలేషన్ గురించి క్లారిటీ ఉందని తెలిపాడు కూడా. అయితే ఆయన ఎప్పుడంటే అప్పుడే పెళ్లి అంటూ చెప్పేసింది సిరి.































