Siri -Srihan: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి శ్రీహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఆదరణ పొందారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి శ్రీహన్ ఒకానొక సమయంలో బ్రేకప్ చెప్పకున్నారనే వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాతగా అరియనాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిరి మాట్లాడుతూ తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక సోషల్ మీడియాలో సిరి శ్రీహాన్ గురించి వచ్చిన కొన్ని పోస్టులను చూపించగా బహుశా అవి బిగ్ బాస్ సీజన్ 5 సమయంలో వచ్చినవి అయి ఉంటాయని ఈమె సమాధానం చెప్పారు.ఇక బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తర్వాత మేమిద్దరం వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని సిరి తెలిపారు.
ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారని అరియాన ప్రశ్నించగా..చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నామని సమాధానం చెప్పింది. ఒకటి రెండు చెప్పగలరా అంటూ తిరిగి ప్రశ్నించింది అరియనా. మా మధ్య ఎలాంటి సమస్యలు అంటే చివరికి బ్రేకప్ చెప్పుకుందామనే గొడవలు వచ్చాయని తెలిపారు.

Siri -Srihan: చెప్పులు లేకుండా రోడ్లపై తిరిగాను…
ఆ సమయంలో శ్రీహన్ నాకు మధ్య గొడవలు జరిగాయని ఏకంగా తను నన్ను ఒంటరిగా వదిలేసి ఒకటే హాలిడే వెకేషన్ వెళ్లారు. ఆ సమయంలో తనకు కోవిడ్ కూడా వచ్చింది.అప్పుడు తనకు కూడా ఏదో ఒకటి చేసుకొని చనిపోవాలనుకున్నానని ఉదయం 6 గంటలకు నిద్ర లేచి మణికొండ ఏరియాలో చెప్పులు లేకుండా రోడ్లపై నడుస్తూ వెళ్లానని సిరి తెలిపారు.నేను ఇలా వెళ్తున్నప్పుడు శ్రీహాన్ వచ్చి తనని ఇంటికి తీసుకెళ్లారని అయితే ఇప్పుడు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు మా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది అంటూ సిరి చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.