Sitara : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు గారి తల్లి అయిన ఇందిరా దేవి గారు తుదిశ్వాస విడిచారు. వయోభారం, కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ఇందిరా దేవి గారు బుధవారం ఉదయం మరణించారు. ఈమె మరణంతో ఘట్టమనేని కుటుంబంతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. అభిమానుల సందర్శనార్థం ఇందిరా దేవి గారి పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్ లో ఉంచారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

నాన్నమ్మ కోసం తళ్లడిల్లిపోతున్న సితార…
ఈరోజు మధ్యాహ్నం ఇందిరా దేవి గారి అంత్యక్రియలు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు. మహేష్ బాబు గారికి వారి తల్లిగారు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో అన్న రమేష్ బాబు మరణించడం, ఇపుడు దైవంగా భావించే తన తల్లి మరణించడం మహేష్ బాబుని తీవ్రంగా కృంగదీసింది. మహేష్ తోపాటు సితార, గౌతమ్ లు కూడా నాన్నమ్మ కోసం కన్నీరు పెట్టుకుంటున్నారు.
Sister ???????????????? Please no ..#RIPIndiraDeviGaru pic.twitter.com/c9viLJmpdv
— Sai Lakshmi ???? (@MeeSaiLakshmi) September 28, 2022
ముఖ్యంగా సితార నాన్నమ్మ కోసం కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. మహేష్ బాబు ఒడిలో కూర్చొని నానమ్మ కోసం ఏడుస్తున్న వీడియో చూసి సూపర్ స్టార్ అభిమానులు బాధపడుతున్నారు. మహేష్ చిన్నతనం అంతా వారి అమ్మ దగ్గరే గడిచింది. ఇప్పుడు సితార, గౌతమ్ లు కూడా వారి నాన్నమ్మ దగ్గర ఎక్కువగా సమయం గడిపేవారట. వరుస విషాదాలతో సూపర్ స్టార్ కుటుంబం కన్నీరు పెట్టుకుంటోంది.




























