డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటలో సెకండ్ సింగిల్ “పెన్నీ” ప్రోమో సాంగ్ కాసేపటి క్రితం విడుదలైంది. అయితే ఇందులో మహేష్ బాబు తో పాటూ అయన కూతురు సితార కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈపాటలో సూపర్ స్టెప్పులతో ఆదరగోట్టింది ప్రిన్సెస్ సితార.

అంతేకాదు ఈ ‘పెన్నీ’ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్ కు సంబంధించ ప్రోమో ఈరోజు విడుదలకాగా… రేపు ఫుల్ సాంగ్ విడుదల కానుంది. పరశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. అటు మహేష్ ఐ జంటగా కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సింది. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి బాణీలు అందిచారు. ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి సింగల్ “కాళావతి” సాంగ్ యుట్యూబ్ లో రికార్తులు తిరగరాస్తున్న విషయం తెలిసిందే.. రేపు విడుదల కాబోయే ఈపాట కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇక ఈపాట ప్రోమో మీరు కూడా చూసేయండి.
































