Sneha Reddy:తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారో ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు మోడరన్ దుస్తులను ధరించి స్టైలిష్ లుక్ లో ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఇక మెగా అల్లూ ఫ్యామిలీలో ఎలాంటి ఈవెంట్స్ జరిగిన అక్కడ అల్లు స్నేహారెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు.ఈ విధంగా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఈమె కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా స్నేహ రెడ్డి ఒక డిజైనర్ ఫ్రాక్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా ఈఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అయితే అచ్చం ఇలాంటి డ్రెస్ లోనే నటి జాన్వీ కపూర్ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ దిగినటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఇలా జాన్వీ కపూర్ ఫోటోలను షేర్ చేయడంతో ఎంతోమంది అభిమానులు స్నేహారెడ్డిని ట్రోల్ చేస్తున్నారు.
చాలా అసహ్యంగా ఉంది…
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నీవు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే చాలా అసహ్యంగా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అచ్చం ఇదే డ్రస్సును నీ కన్నా ఎంతో బొద్దుగా ఉన్నటువంటి జాన్వీకపూర్ వేసుకోవడంతో చూడటానికి చాలా హాట్ గా ఉన్నారని ఇకపై ఇలాంటి డ్రెస్సులు మీరు వేసుకోకపోవడమే మంచిది అంటూ ఈమెకు నేటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి నెటిజెన్స్ ఇచ్చిన సలహాలను స్నేహ రెడ్డి పాటిస్తారా లేకపోతే తన దారి రహదారి అంటూ తనకు నచ్చిన విధంగా నడుచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.































