Mohan Babu:టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా విద్యారంగంలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను నెలకొల్పి నేడు యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్లారు. ఇలా సినీ రంగంలోనూ, విద్యారంగంలోనూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు మార్చి 19వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ కామెంట్ చేస్తూ తన జీవితంలో పడిన కష్టాల గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తాను కేవలం రెండు జతల బట్టలతో తిరుపతి నుంచి మద్రాసు వెళ్లి ఒక కారు షెడ్ లో జీవనం కొనసాగించానని తినడానికి తిండి లేక ఏడు సంవత్సరాల పాటు ఎంతో ఇబ్బంది పడ్డానని మోహన్ బాబు ఈ సందర్భంగా తన కష్టాలను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.

భక్తవత్సలం నాయుడుగా ఉన్న నన్ను మోహన్ బాబుగా దాసరి నారాయణరావుగారు ఇండస్ట్రీకి పరిచయం చేశారని ఈ సందర్భంగా తన గురువు గారిని గుర్తు చేసుకున్నారు. తనని ఎంతో మంది ఎన్నో రకాలుగా వాడుకున్నారని తన వల్ల ఎంతో మంది సహాయం పొందారని చెప్పిన మోహన్ బాబు చాలా మంది చేతిలో కూడా తను మోసపోయానని కష్టాలలో ఉన్నప్పుడు తనను ఎవరు ఆదుకోలేదంటూ గత విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఆ కష్టాలు ఎవరికి రాకూడదు….
తాను ఎంతో మంది చేతిలో ఎన్నో రకాలుగా మోసపోయానని ఇలా మోసపోవటం వల్ల ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని మోహన్ బాబు వెల్లడించారు.తన జీవితాన్ని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో కష్టాలు ఉన్నాయని ఆ కష్టాలు తన బిడ్డలకు కాకుండా మరి ఎవరికీ రాకూడదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఎన్నో పార్టీలకు నేను పని చేశానని అలా పని చేసినప్పుడు కేవలం ఎన్టీఆర్ గారు మాత్రమే తనని ఎంపీగా రాజ్యసభకు పంపించారని ఇక రాజకీయాలలో చంద్రబాబు తనని మోసం చేసినట్లు కూడా మోహన్ బాబు ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.































