Social activist Krishna kumari : తండ్రి లేడు, తల్లే అల్లారుముద్దుగా పెంచింది. బాగా కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్న శ్వేత కలలు పెళ్లితోనే ఆగిపోయాయి. పెళ్లయ్యాక చదువుకోడానికి ఒప్పుకుంటామని చెప్పి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళయ్యాక ఆ ఊసే ఎత్తలేదు. వావి వరసలు లేకుండా చెల్లి వరస అయ్యే శ్వేతతో ఆడపడుచు భర్త అసభ్యంగా ప్రవర్తించిన అత్తింటి వారు పట్టించుకోకపోగా తప్పు నీదేనని క్షమాపణ చెప్పించడంతో భరించలేక గర్భంతో ఉన్న తాను వైజాగ్ సముద్ర తీరాన శవమై కనిపించింది. అయితే ఆమె మరణం అనుమానస్పద మరణంగా మొదట కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే ఆమెది ఆత్మహత్య గా పోలీసులు చెప్పినా ఆమె చావుకు కారణం మాత్రం ఆమె భర్త ఆంటున్నారు సామాజిక వేత్త కృష్ణ కుమారి.

అతడి నిర్లక్షమే కారణం…
శ్వేత మానసికంగా బాగా క్రుంగి పోవడానికి కారణం ఆమె భర్త ఆమెను అశ్రద్ధ చేయడమే. అతను హైదరాబాద్ లో ఉంటూ ఆమెను తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన మణికంఠ అత్తింట్లో వేధింపులను చెప్పినా అతను పట్టించుకోకుండా పోవడంతో శ్వేత ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కృష్ణ కుమారి అభిప్రాయపడ్డారు. శ్వేత అందులోనూ మొదటి సారి తల్లి కాబోతుంది. ఆ సమయంలో భర్తతో ఎక్కువగా ఉండాలని ఏ స్త్రీ అయినా అనుకుంటారు. కానీ హైదరాబాద్ లో మణికంఠ ఉంటూ ఆమెను ఇక్కడే ఉంచడం కనీసం తనను తన పుట్టింటికి పంపకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తింది.

ఆల్రడీ శ్వేత చాలా సెన్సిటివ్ అమ్మాయి కావడం వల్ల ఇక అత్తింట్లో మాటలు కాస్త కటువుగా ఉండటం దానికి తోడు భర్త తనతో ఉండకపోవడం అందులోనూ గర్భవతి అవడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తుంది హార్మోనల్ ఇంబాలన్స్ అవడం వల్ల డిప్రెషన్ కి లోనై ఇలాంటి నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసేముందు ఆస్తి ఎంతుంది అబ్బాయి ఏమి సంపాదిస్తున్నాడు అని చూస్తున్నారు కానీ మా అమ్మాయి వాళ్ళింట్లో ఇమడగలదా లేదా అనే విషయం ఆలోచించడం లేదు. చావు ఎపుడూ సమస్యకు పరిష్కారం కాదు అంటూ కృష్ణ కుమారి తెలిపారు. సింగిల్ పేరెంట్ గా ఎంతో మంది హ్యాపీగా ఉంటున్నారు, సమస్యలను చూసి అధైర్యపడి చావే పరిష్కారం అనుకోవద్దు అంటూ సూచించారు.































