Social Activist Krishna Kumari : వరంగల్ లో సంచలనం రేపిన ప్రీతి ఆత్మహత్య ఉదంతంలో సైఫ్ ప్రధాన నిందితుడుగా కనిపిస్తున్నాడు. వాట్సాప్ చాట్ ఆధారంగా సైఫ్ ప్రీతిని టార్గెట్ చేసి వేధించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య అభ్యశిస్తున్న ప్రీతిని రెండో సంవత్సరం పీజీ చేస్తున్న విద్యార్థి సైఫ్ ర్యాంగింగ్ పేరుతో వేదించడం వల్ల ప్రీతి హానికరం ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శరీరంలోన అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయకుండా అయిపోతుందటంతో ఆ అమ్మాయిని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఇక ఈ ఇష్యూ గురించి సామాజిక వేత్త కృష్ణ కుమారి గారు విశ్లేషణ అందించారు.

ఒత్తిడి భరించలేక ఇతరులను వేదిస్తున్నారు…
కృష్ణ కుమారి గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజిలలో ర్యాగింగ్ పేరుతో చేస్తున్న వేధింపులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. వాళ్ళు సర్వ సాధారంగా మాట్లాడే భాష ఎంత అభ్యంతరకరంగా ఉంటుందో తెలుసు. అయితే ఇక్కడ ఐదేళ్లు మెడిసిన్ చదివి అక్కడ ఆల్రెడీ ఇలాంటి ర్యాంగింగ్ చూసి వచ్చిన ప్రీతికి మళ్ళీ ఇలా పీజీ లో ర్యాంగింగ్ ను తట్టుకోలేక పోవడం కొంత ఆలోచించాలి.

ఆ అమ్మాయి ఎంత ఒత్తిడికి గురై ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఈ మెడికల్ కాలేజ్ లో సీనియర్స్ జూనియర్స్ కోసం ఆకలితో ఉన్న పులులు లాగా ఎదురు చూస్తుంటారు. వాళ్ళు రాగానే వారి పనులన్నీ జూనియర్స్ కి ఇచ్చి ప్రెషర్ చేస్తారు. వీళ్ళు పని తప్పించుకోడానికి వాళ్లకు పని ఇచ్చి ఒత్తిడి తెస్తారు. ఇక వాళ్లకు కనిపించిన ప్రతిసారి విష్ చేయాలి, గౌరవం ఇవ్వాలి అంటూ సూపిరియారిటీ చూపిస్తారు. ఏది ఏమైనా ఎలాంటి ఒత్తిడి కలిగించినా కొంత సంయమనం పాటిస్తే ఓపిక పట్టుంటే ప్రీతి ఈరోజు బ్రతికే ఉండేది. ప్రీతి లాగా మరెవరూ ఇలాంటి పని చేయకూడదని కోరుకుందాం. ఏదైనా సమస్య ఉంటే కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది అంటూ చెప్పారు.



























