Social Activist Usha Sree : వైశాలి కిడ్నాప్ ఉదంతం గురించి మాట్లాడుతూ సామాజిక వేత్త ఉష శ్రీ తన జీవితంలో జరిగిన సంఘటనలు అలానే వాటి వల్ల ఇప్పటికీ తాను పడుతున్న అవమానాలను చెప్పారు. శ్రీకాంత్ రెడ్డి వంగాల అనే వ్యక్తితో భాగస్వామిగా వ్యాపారం చేసినపుడు పెళ్లి చేసుకోమని అతను టార్చర్ చేశాడంటూ తెలిపారు. ఆ ఇష్యూ నుండి బయటికి వచ్చినా సొసైటీ ఎలా చూస్తుంది ఏ తప్పు లేకపోయినా ఒక అమ్మాయి వైపు ఎన్ని వేళ్లు చూపిస్తాయి అన్న విషయాన్ని ఉష వివరించారు.

ఒక అమ్మాయి నో అన్నదంటే నో అంతే…
వైశాలి విషయంలో మాట్లాడుతూ తనకు మీడియా ముందు మాట్లాడుతూ చెప్పిన విషయాలు నన్ను కదిలించాయి అంటూ ఉష గారు అభిప్రాయపడ్డారు. వైశాలి కేవలం స్నేహం చేసింది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి అని క్లారిటీగా చెప్పినా కూడా నవీన్ రెడ్డి తనను టార్చర్ చేశాడంటూ ఉష అభిప్రాయపడ్డారు. నేను బిజినెస్ చేసిన శ్రీకాంత్ రెడ్డి వంగాల ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న వ్యక్తి, అయినా నన్ను పెళ్లి చేసుకోవాలని చుసాడని నేను ఒప్పుకోలేదని నీకు ఎలా పెళ్ళవుతుందో చూస్తా అంటూ బెదిరించాడు, పోలీసులు కూడా అతనికే సపోర్ట్ అంటూ తెలిపారు.

శ్రీకాంత్ రెడ్డి వంగాల తండ్రి సంజీవ్ రెడ్డి కి తెలంగాణ కు చెందిన రాజకీయ నాయకుడు దివంగత నయని నరసింహ రెడ్డి తో మంచి అనుబంధం ఉండటంతో పోలీసులు కూడా అతని వైపే ఉన్నారు. అలా నన్ను ఐదేళ్లు టార్చర్ చేసారు. అలా ఇప్పుడు వైశాలి విషయంలో కూడా నవీన్ రెడ్డి ఉచ్చు బిగస్తున్నాడు అంటూ మాట్లాడారు. ఆ అమ్మాయిని ఇక సొసైటీలో ఎలా చూస్తారు అంటూ అభిప్రాయపడ్డారు. పోలీసుల అండతోనే నవీన్ రెడ్డి ఇలా చేస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు ఉష శ్రీ.































