Sohel: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవచ్చు.అలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈ కార్యక్రమం తరువాత ఎలాంటి అవకాశాలు లేక కొందరు పూర్తిగా కనుమరుగయ్యారు. మరికొందరు అడపాదడపా పలు క్యారెక్టర్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ బిగ్ బాస్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఏకైక వ్యక్తి సోహైల్ అని చెప్పాలి.

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా వెళ్ళిన సోహైల్ టాప్ 3 లో నిలబడ్డారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆఫర్ చేసిన 25 లక్షలు తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చిన సోహెల్ ఎంతో మంది ప్రశంసలు అందుకోవడమే కాకుండా బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇప్పటికే సోహెల్ ప్రధాన పాత్రలో మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు, ఆర్గానిక్ మామ..హైబ్రిడ్ అల్లుడు వంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా సోహెల్ నాలుగవ సినిమాకి కూడా కొబ్బరికాయ కొట్టారు.
సోహైల్, మోక్ష జంటగా..
శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో లక్కీ లక్ష్మణ్ అనే సినిమాను ప్రకటిస్తూ కొబ్బరికాయ కొట్టారు.వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పూజా కార్యక్రమాలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ విధంగా బిగ్ బాస్ గుర్తింపుతో సోహెల్ మాత్రమే హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.





























