ఓపెన్ గా, నిర్మొహమాటంగా మాట్లాడే హీరోయిన్స్ లలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఒకరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజగా మరోసారి హాట్ టాపిక్ అయింది సోనమ్ కపూర్. ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ బిజినెస్మెన్ ఆనంద్ అహుజా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత కూడా సినిమాలతో రాణిస్తుంది. తాజగా సోనమ్ – ఆనంద్ ఆహుజా ల వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది.

ఈ క్రమంలో పెళ్లి రోజును మర్చిపోయిన ఆనంద్ అహూజా కొంచెం ఆలస్యంగా గుర్తు తెచ్చుకుని ఇంస్టగ్రామ్ లో ఒక రొమాంటిక్ గా “మన బంధానికి ప్రతిరోజూ స్పెషల్ డే నే.. కానీ పెళ్లి రోజున పోస్ట్ చేయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు చేస్తున్నాను” అంటూ వారిద్దరూ కలిసినప్పటి పోటో ఒకటి షేర్ చేసారు. దీనిపై అంతకంటే రొమాంటిక్ గా రిప్లై ఇచ్చింది సోనమ్. “లవ్ యూ.. లవ్ యూ.. త్వరగా నువ్ బెడ్ మీదికిరా ” అంటూ పబ్లిక్ గా కామెంట్ చేసింది. దీనితో వీరిద్దరి సంభాషణ ఇప్పుడు నేట్టింట హాట్ టాపిక్ అవుతుంది
































