39 మంది ఫిలిప్పీన్స్‌ చిన్నారుల కాలేయం మార్పిడి ఆపరేషన్ కోసం కృషి చేస్తున్న రియల్ హీరో సోనూసూద్ !

0
369

వెండితెరపై విలన్ పాత్రల్లో నటించే సోనూ సూద్ నిజ జీవితంలో రియల్ హీరోగా అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. తనకున్న దాంట్లో కష్టాల్లో ఉన్నవాళ్ళందరికి తోచిన సహాయం చేస్తూ ఆదుకుంటున్నాడు.

కరోనా లాక్ డౌన్ టైంలో ఎంద‌రికో అండ‌గా నిలుస్తున్న మాన‌వ‌తా వాది సోనూ సూద్‌. లాక్ డౌన్ టైంలో వలస కూలీలను ఎవరి స్వస్థలాలకు వాళ్ళను చేర్చి వాళ్ళ పాలిట సోనూసూద్‌ దేవుడైపోయాడు. ఇప్పుడు కష్టం అనే మాట ఎక్కడ వినబడితే అక్కడ వాలి పోతున్నాడు సోనూసూద్‌. లాక్ డౌన్ సమయంలోనే కాదు.. ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు. అక్కడితో ఆగకుండా లాక్ డౌన్ తర్వాత కూడా ఆయన తన సేవలను కొనసాగిస్తున్నారు. వరంగల్ లో ఓ యువతి కరోనా సంక్షోభంతో ఉద్యోగం కోల్పోవడంతో సోషల్ మీడియా ద్వారా ఆ విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేశాడు.

తాజాగా 39 మంది చిన్నారుల కాలేయం మార్పిడి ఆపరేషన్ కోసం ఫిలిప్పీన్స్‌ నుంచి న్యూఢిల్లీకి చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మ‌నీలా నుండి 39 మంది చిన్నారులతో కూడిన ప్ర‌త్యేక విమానం బ‌య‌ల్దేరి 2 రోజుల‌లో ఢిల్లీ చేరుకోనుంది. ఈ 39 మందిలో ఫిలిప్పీన్స్‌ కి చెందిన చిన్నారులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ చిన్నారులందరూ 1 నుండి 5 ఏళ్ల లోపువాళ్ళే.! వీళ్ళందరూ గత కొంత కాలంగా బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ ప‌డుతున్నారు. ఈ చిన్నారులందరికి న్యూఢిల్లీలోని లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయ‌నున్నారు. ఇలా చిన్నారుల విష‌యంలో సోనూసూద్ చూపిన ఔదార్యంపై దేశంలోని ప్రజలందరూ ప్ర‌శంస‌ల జ‌ల్లులను కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here