ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి మరియు అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు కలిసి ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలలో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు’ మొదలు పెట్టారు. అయితే చిరంజీవి, రామ్ చరణ్ ల చేపట్టిన ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా రియల్ హీరో సోనూసూద్ కూడా తన స్పందన తెలియజేశారు.

మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ల ఈ నిర్ణయం చాలా గొప్పది, ఆక్సిజన్ బ్యాంకులు ప్రాంభించడం ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ ఈ క్రమంలో మిగిలిన సెలెబ్రిటీలు అందరూ ముందుకు రావాలి. ప్రభుత్వం సాయం చేస్తుందిలే అని చూడకుండా మనకు చేతనంత సాయం చేయాలి అని సోనూ సూద్ పేర్కొన్నారు.

































