కరోనా కష్ట కాలంలో మొదటి నుంచీ తన ఔదార్యాన్ని చాటుతూనే ఉన్నారు రియల్ హీరో సోనూ సూద్. ఇటీవలే అయన కరోనా బారిన పడినా.. కోలుకున్న ఆయన అర్హులైన వారికి సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకంటే వేగంగా స్పందిస్తూ ఆపదలో ఉన్న ఏంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు సోనూసూద్.

ఈ నేపధ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నా దానిని అయన సున్నితంగా తిరస్కరిస్తూనే వున్నారు. తాజాగా రియల్ హీరో సోనూసూద్ ‘భవిష్యత్ ప్రధాని’ అంటూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సహా అయన ఫాన్స్ అభివర్ణిస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై సోనూ సూద్ స్పందించారు.

రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని సాధారణ వ్యక్తిగా ఉంటూ ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతానని సోనూసూద్ స్పష్టం చేసారు. “నేను ఓక సామాన్య వ్యక్తిగా బాగానే ఉన్నాను. నా సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికలతో పోరాడటం ద్వారా నేను ఎం పొందుతాను ? అది నా పని కాదు.” అంటూ రాజకీయాలపై అయన స్టాండ్ ఏంటో మరోసారి తెలియచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here