సోను సూద్… ప్రస్తుతం భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్న రియల్ హీరో సోనుసూద్. అయితే తాజగా ఆయనకు ‘పద్మవిభూషణ్‌’ అవార్డును ఇవ్వాలంటూ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలపై అయన స్పందిస్తూ నాకు ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలే తనకు గొప్ప అవార్డులని సోనూసూద్‌ అన్నారు.

వివరాల్లోకి వెళితే.. సోనూసూద్‌కు ఈ సంవత్సరం ‘పద్మవిభూషణ్‌’ అవార్డును ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్‌ నటుడు బ్రహ్మాజీ ట్వీట్‌ చేసారు. ఈ క్రమంలో అయన ఈ కరోనా కష్టకాలంలో సోనూసూద్ నిర్విరామంగా సేవలు చేస్తున్నారని ఆ సేవలను గుర్తించి ఈ అవార్డుతో గౌరవించాలని అభిప్రాయపడ్డారు. తాజగా బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్‌పై స్పందిచారు సోనూసూద్.. ‘బ్రదర్‌.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను’ అని రిప్లై ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here