బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలికి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు అధికారిక ప్రకటన చేసాయి. నిన్న రాత్రి RTPCR టెస్టులు చేయగా కోరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు బిసీసీఐ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం సౌరవ్ గంగూలి కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుటున్నారని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలు ఉండటంతో నిన్న సౌరవ్ గంగూలీ RTPCR టెస్టు చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారంతా తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా ఈ ఏడాది జనవరిలో గంగూలీ కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. కొన్ని రోజులకు కోలుకున్న విషయం తెలిసిందే..































