పాటలు పాడాలని అందరికీ ఉంటుంది కానీ ఇష్టమున్నంత మాత్రాన అందరూ సింగర్స్ కాలేరు. సింగర్ కావాలంటే చక్కని గొంతు, సంగీత జ్ఞానం రెండూ ఉండాలి. ఇవి రెండూ లేని వారు సంగీతం రంగంలో కొనసాగలేరు. తెలుగు పరిశ్రమలో గాన గంధర్వులు ఎంతో మంది ఉన్నారు. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలసుబ్రహ్మణ్యం అందులో ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇతని గొంతులో రాళ్ళను సైతం కరిగించగల ప్రతిభ ఉంది.

ఎస్పీబీ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం కి సంగీతం అంటే ఎంత ఇష్టమో తన పిల్లల పేర్లు ఏంటో తెలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. అతని కుమార్తె పేరు పల్లవి కాగా కుమారుడు పేరు చరణ్.ఎస్పీ శైలజ కూడా పాటలు పాడుతారు. టబు, సోనాలి బింద్రే వంటి అగ్రతారలకు ఆమె గాత్ర దానం చేసి అందరి మనసులను పులకరింప చేశారు. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు కూడా మంచి గాయకుడు.

చిన్నతనం నుండే ఆయన సినిమా పాటలు పాడేవారు. ఆయన మంచి గాయకుడిగా మాత్రమే కాదు మంచి ప్రొడ్యూసర్, యాంకర్, నటుడిగా కూడా పేరొందారు. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమాలోని చిగురాకు చాటు చిలక, అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలోని గంగా, నాగార్జున మన్మధుడు సినిమాలో నేను నేనుగా లేనే వంటి అనేక అద్భుతమైన పాటలను ఆలపించి తెలుగు శ్రోతలను అలరించారు. సంగీతంతో పాటు నటనపై కూడా ఆసక్తి ఉండటంతో అనేక తమిళ చిత్రాల్లో నటించి మంచి నటుడిగా పేరు పొందారు.

క్యాపిటల్ ఫిలిమ్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థని నిర్మించి ఆ సంస్థ పేరిట పలు సినిమాలను ప్రొడ్యూస్ చేయగా అవన్నీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో ఎస్పీ బాలు సంపాదించిన ఆస్తి మొత్తం పోయి.. అప్పులే మిగిలాయి. తమాషా ఏమిటంటే అతను నిర్మించిన సినిమాలకు నేషనల్ అవార్డు, తమిళ రాష్ట్ర ఉత్తమ పురస్కారాలు లభించాయి. ఆర్థిక సమస్యలను అధిక మించడానికి బుల్లితెర రంగంలో అరంగేట్రం చేసిన ఎస్పీ చరణ్ తమిళ తెలుగు సీరియల్స్ లో నటించారు. బుల్లితెర కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న క్రమంలో 1998వ సంవత్సరంలో స్మిత అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల 2002వ సంవత్సరంలో పరస్పర అంగీకారంతో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే ఎస్పీ చరణ్ కి రెండవ పెళ్లి చేయాలనుకున్నారు బాలు.

ఆ క్రమంలోనే ఒక పార్టీలో సోనా హెడెన్ అనే ఒక హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించారు చరణ్. దాంతో సోనా హెడెన్ చెన్నై కమిషనర్ కి ఫిర్యాదు చేయగా చరణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ మీద జైలు నుండి విడుదలైన చరణ్ తన స్నేహితులతో కలిసి సోనా పై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ కేసు ఎక్కడికో వెళ్ళి పోతుండగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కలగజేసుకొని చరణ్ చేత సోనాకి క్షమాపణలు చెప్పించారు. దాంతో అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది.

మొదటి భార్య అయిన స్మిత తన పిల్లలు చెడు ప్రవర్తన కలిగిన చరణ్ కి దగ్గర అవుతారేమోననే భయంతో చెన్నై నుండి అమెరికా కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చరణ్ 2012వ సంవత్సరంలో అపర్ణ ని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తన కొడుకు చరణ్ వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని చెప్పుకోవచ్చు