నెమ్మదిగా మాట్లాడితే కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చా..?

0
354

చైనా దేశంలోని వుహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశం మినహా ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. అమెరికా, బ్రెజిల్, భారత్, మరికొన్ని దేశాలపై కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావం చూపింది. కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో నెమ్మదిగా మాట్లాడటం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని తేలింది.

వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. శాస్త్రవేత్తలు కొత్త అధ్యయనం ద్వారా గట్టిగా మాట్లాడవద్దని…. అలా చేసిన వారికి కరోనా సోకి ఉంటే వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి ఉధృతి తగ్గే వరకు వెంటిలేషన్ ఎక్కువగా ఉండే గదులకు ప్రాధాన్యత ఇవ్వాలని… గాలి ఇంటాబయట ఫ్రెష్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.

ప్రాణాలకు అపాయం కలిగించే కరోనా మహమ్మారి నిశ్శబ్ద వాతావరణంలో తక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు తాము గుర్తించామని… వెయిటింగ్ రూమ్ లు, హోటళ్లు, ఆస్పత్రులలో వైరస్ త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రద్దీ లేని నిశ్శబ్ద తరగతి గదులు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయని సూచిస్తున్నారు. బిగ్గరగా మాట్లాడినా లేదా పాట పాడినా 30 రెట్లు ఎక్కువ ఏరోసోల్‌ ఉత్పత్తి అవుతుందని పేర్కొంటున్నారు.

మరోవైపు శాస్త్రవేత్తలు వైరస్ తగ్గుముఖం పట్టే వరకు ఇళ్లకే పరిమితమైతే మంచిదని… వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే పూర్తిస్థాయిలో వైరస్ కట్టడి సాధ్యమవుతుందని…. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రపంచ దేశాల ప్రజలకు అందుబాటులోకి రావడానికి చాలా నెలల సమయం పడుతుందని… అప్పటివరకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here