బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా తన 25వ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్ విడుదల చేశారు.

ప్రభాస్ తన 25వ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మాణంలో “స్పిరిట్”అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే టైటిల్ తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ పోస్టర్ చూసిన ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా ఇది వరకు ప్రభాస్ ను ఎప్పుడూ చూడని జానర్ లో సందీప్ రెడ్డి వంగ చూపించబోతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని తెలియజేయనున్నారు.
Glad to announce our association with @TSeries & @VangaPictures for the upcoming film SPIRIT with our darling #Prabhas and director @imvangasandeep, produced by #BhushanKumar#Prabhas25SandeepReddyVanga#Prabhas25 #Vamshi #Pramod @VangaPranay #KrishanKumar pic.twitter.com/ZPWJKqkzSh
— UV Creations (@UV_Creations) October 7, 2021
ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అదేవిధంగా ప్రభాస్ హీరోగా ప్రస్తుతం సలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్ తన 25వ చిత్రం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.





























