Sr Actor Narasimharaju : ఆ సినిమాలో నేను హీరో ఆయన విలన్… తరువాత చిరంజీవి సినిమాలో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాల్సి వచ్చింది : సీనియర్ నటుడు నరసింహారాజు

0
266

Sr actor Narasimharaju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపుగా 110 సినిమాల్లో నటించారు.

ఆ సినిమాలో నేను హీరో చిరంజీవి విలన్…

జానపద సినిమాలతో బాగా పేరు అభిమానుల్స్ని సంపాదించిన నరసింహరాజు గారు, ఇక నీడలేని ఆడది వంటి సినిమాలలో కూడా మంచి నటన కనబరిచారు. ఇక అప్పట్లో నరసింహారాజు గారు దాసరి నారాయణ రావు గారి శిష్యుడుగా ఉండేవారు. ఇక అదే గ్రూప్ లో మోహన్ బాబు, ఈశ్వర్ రావు, చిరంజీవి అందరూ ఉండేవారు. పునాదిరాళ్లు, పున్నమి నాగు వంటి సినిమాల్లో వారితో కలిసి నటించారు నరసింహ రాజుగారు. అయితే అప్పటి సినిమాల్లో అందరి ఇమేజ్ దాదాపు సమానం అయినా ఒకింత నరసింహ రాజు హీరో చిరంజీవి గారు నెగెటివ్ షేడ్ లాంటి పాత్ర ఉండేవి.

ఆ తరువాత కాలంలో చిరంజీవి హీరో గా చేసిన సినిమాలో నరసింహారాజు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ‘మగధీరుడు’ సినిమాలో చిరంజీవి హీరో అయితే నరసింహరాజు గారు ఒక పాత్రలో నటించారు. కానీ దీనికి కారణం విజయ బాపినీడు గారు అడగడం వల్ల స్నేహం కొద్ది చేశారట నరసింహారాజు గారు. 1985 వరకు సినిమాల్లో చాలా బిజీగా ఉండి మంచి అవకాశాలను అందుకున్న ఆయన ఆ తరువాత రేస్ లో వెనుకబడిపోయానంటూ చెప్పారు. ఒకరిని వెళ్లి అవకాశాలు అడగాలన్నా మొహమాటం కొద్ది అడగలేక మనకు ఉన్నది చాలు కదా అని సరిపెట్టుకున్నానంటూ చెప్పారు నరసింహారాజు గారు.