Sree Reddy : తెలుగులో శ్రీ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు సినిమాల్లో కనిపించకపోయిన సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఈమె ఏ సెలబ్రిటీ గురించి ఏం మాట్లాడుతుందో అన్న భయం సినిమా ప్రముఖుల్లో మొదలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈమె ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. చాలా రోజులుగా శ్రీ రెడ్డి తన మకాం హైదరాబాద్ నుండి తమిళనాడుకి మార్చేసింది. ఈమధ్యనే ఒక వీడియోలో తాను ఎందుకు హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఇక్కడ ఇండస్ట్రీ లోని పెద్ద కుటుంబాల వాళ్ళు తనకు అవకాశలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. సినిమాల్లో కానీ టీవీ రంగంలో కానీ ఎక్కడ తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ ఉండటంతో చెన్నై వెళ్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించుకుంటున్నానని చెప్పింది.అయితే ఇటీవలే చాలా రోజుల గ్యాప్ తరువాత తెలుగు మీడియాలో మళ్ళీ మాట్లాడింది శ్రీ రెడ్డి మళ్ళీ రాజకీయాలు మీద విమర్శలు కామెంట్స్ తో వైరల్ అవుతోంది.

కేటీఆర్ మీద విమర్శలు గుప్పించిన శ్రీ రెడ్డి….
తెలంగాణలో వరుసగా జరుగుతున్న సంఘటనల గురించి శ్రీ రెడ్డి మాట్లాడింది. గిరిజన యువతి పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య, గిరిజన యువకుడు నవీన్ హత్య, ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య, నాలుగేళ్ళ చిన్నారి కుక్కదాడిలో మరణించడం వంటి సంఘటనల గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి విషయాలను కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోదని విమర్శించింది.

కేటీఆర్ సినిమా వేడుకలుకు వెళ్తూ వారితో ఫోటోలు దిగుతుంటారు కానీ ఇటువంటి అంశాలను పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లంతా సెలబ్రిటీలు కాదు కాబట్టి అంటూ మాట్లాడారు. పేద వాళ్ళు గిరిజన పిల్లలు కాబట్టి ప్రాణం పోయిన వెంటనే శవాన్ని ఎత్తేయాలి కాని రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయకూడదు అంటూ శ్రీ రెడ్డి ఎద్దెవ చేసింది.