Sree Sathya : విజయవాడకి చెందిన మంగళంపల్లి శ్రీ సత్య మోడలింగ్, అలాగే సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు నాట. జీ తెలుగు లో ప్రసారమయ్యే ‘త్రినయని’ సీరియల్ తో బుల్లి తెర అభిమానులకు దగ్గరైనా శ్రీ సత్య ప్రస్తుతం బిగ్ బాస్ కొత్త సీజన్ లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక బిగ్ బాస్ లో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలవగా కొంతమంది శ్రీ సత్య పేరును నామినేట్ చేసారు. దీంతో శ్రీ సత్య తన గతం గురించిన విషయాలు చెప్పి అందరినీ ఏడిపించేసింది.

అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్… 19 ఏళ్లకే బ్రేక్ అప్…
శ్రీ సత్య ను ఎలిమినేషన్ నామినేషన్స్ లో ఆటిట్యూడ్ చూపిస్తోంది, ఎవరితో సరిగా మాట్లాడదు అంటూ నామినేట్ చేసారు కొంతమంది ఇంటి సభ్యులు. ఇక నామినేషన్ ప్రక్రియలో తాను అందరితో ఎందుకు మాట్లాడటం లేదో తన గతం గురించి చెప్పింది శ్రీ సత్య. తాను 19 ఏళ్లకే ఒకరితో ప్రేమలో ఉన్నానని అయితే వాడు నన్ను నమ్మించి మోసం చేసేసరికి తట్టుకోలేక పోయానని ఆ షాక్ వల్లే మా అమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పింది. ఆ సంఘటనతో పెళ్లి ఇక చేసుకోనని ఇంట్లో చెప్పేశానని చెప్పింది సత్య. ఇక తన అక్క పెళ్లి అయ్యాక తల్లిదండ్రుల బాధ్యత తానే తీసుకున్నానని చెప్పింది. తల్లిదండ్రులను హైదరాబాద్ షిఫ్ట్ చేసి తాను పోషిస్తున్నట్లు తెలిపింది.

ఇక మళ్ళీ మూడు నెలల క్రితం అమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం దాంతో పక్షవాతం రావడంతో మొత్తం అమ్మ పనులన్నింటినీ నాన్నే చూసుకుంటారు. అమ్మ బెడ్ కి పరిమితమై ఉంటే నాన్నే చిన్న పిల్లను చూసుకున్నట్లు చూసుకుంటూ తనకు డైపర్స్ కూడా మారుస్తూ చూసుకుంటున్నారు. ఇవన్నీ చూసాక నాకు ఎవరితోనూ మాట్లాడాలని నమ్మాలని అనిపించలేదు. నా లవ్ బ్రేక్ అప్ వల్ల ఎవరినైనా నమ్మితే మళ్ళీ మోసపోతే భరించే శక్తి లేక ఎవరితో పెద్దగా మాట్లాడను. అర్జున్ నాకు మోడలింగ్ అప్పటి నుండి పరిచయం. నాలుగేళ్లుగా పరిచయమైనా ఇప్పటికీ ఒక పది సార్లు మాట్లాడి ఉంటాను అంటూ తన గతాన్ని చెప్పడంతో ఒక్కసారిగా ఇంటి సభ్యులు అందరూ ఎమోషనల్ అయ్యారు. అనవసరంగా సత్య ను నామినేట్ చేశామని బాధపడ్డారు.



























