Sreemukhi: బుల్లితెరపై ఈటీవీలో యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టి యాంకర్ గా తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకుపోతోంది శ్రీముఖి. ఇక శ్రీముఖి అటు బుల్లి తెర పై యాంకరింగ్ తో కేక పుట్టిస్తూనే మరోవైపు సినిమాల్లోను నటిస్తూ సత్తాచాటుతోంది. ఇక ఈ అమ్మడు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి సత్తా చాటుతోంది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా వచ్చి రన్నర్ అప్ గా మిగిలింది. తన హై ఎనర్జీతో షోలో ఆకట్టుకుంది.

లక్షల్లో శ్రీముఖి రెమ్యూనరేషన్…..
ఇక ఈ అమ్మడు ఈ మధ్యనే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంస్థలు ఈ సినిమా ను నిర్మించాయి ఈ మధ్యనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక శ్రీముఖి ఇట్స్ టైం టు పార్టీ అంటూ మరో సినిమాలో నటిస్తోంది. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమా లో శ్రీముఖి పోలీసు పాత్రలో నటిస్తోంది. యువకులను, అమ్మాయిలను యాప్ ద్వారా బ్లాక్ మైలింగ్ చేస్తూ అరాచకాలు అసలు దీని వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని కనుగొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీముఖి నటించింది. ఇక శ్రీ ముఖి తాను చేసే షోలకు 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. ఇక ఈ అమ్మడు ఇపుడు చిరంజీవి నటిస్తున్న తదుపరి చిత్రంలో నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఖుషి సినిమా లోని నడుం సీన్ స్పూఫ్ ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి.

































