Sreemukhi : సౌత్ ఇండియన్ సినిమాలకు గాను ఉత్తమ చిత్రాలు, ప్రదర్శన అదారంగా సైమా అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మొదటిసారి 2012 లో సైమా అవార్డ్స్ వేడుకను ప్రారంభించారు. ఇప్పుడు 2022 సంవత్సరానికి గాను 10వ సైమా అవార్డ్స్ వేడుక బెంగుళూరులో అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అలీ, శ్రీముఖి వ్యాఖ్యతలుగా వ్యవహారించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హాజరు అవ్వడంతో పాటు స్టేజి మీదనే శ్రీముఖి ని ముద్దులతో ముంచెత్తాడు.

ఐ లవ్ యూ రణ్‌వీర్, ఐ లవ్ యూ సైమా అంటూ.. ఆనందాన్ని పంచుకున్న శ్రీముఖి…
ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో ‘అదుర్స్’ అనే ఓ ప్రోగ్రాముతో యాంకర్‌గా పరిచయమైన శ్రీముఖి, ప్రస్తుతం ఎక్కువ పాపులరిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్ లలో ఒకరుగా బుల్లితెర మీద కొనసాగుతున్నారు. ఒక వైపు యాంకర్ గా రాణిస్తూనే, మరో వైపు ఇలాంటి ప్రోగ్రాములకు వ్యాఖ్యతగాను, సినిమాలలో కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకకు వ్యాఖ్యతగా వ్యవహారిస్తున్న శ్రీముఖి కి ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ వేడుకకు హాజరు అయిన బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ స్టేజి పైకి ఎక్కి నేరుగా శ్రీముఖి వైపు వెళ్లడమే కాకుండా.. మొదట కౌగిలించుకొని తరువాత తన చేతులపై ముద్దులు పెట్టాడు.

ఈ సంఘటనకు సంబరపడి పోయిన శ్రీముఖి దీనికి సంబందించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. వీడియోతో పాటు ‘ఇది జరిగిందా?.. ఐ లవ్ యూ రణ్‌వీర్ సింగ్. ఇది జరిగేలా చేసినందుకు ఐ లవ్ యూ సైమా అవార్డ్స్’ అంటూ తన ఆనందాన్ని తెలియజేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అభిమానులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొంతమంది ‘అక్కా రణ్‌వీర్ సింగ్ నీ ఫేవరేట్ హీరో అని తెలుసు.. ఎట్టకేలకు నువ్వు సాధించావు, రణ్‌వీర్ సింగ్ లాంటి మంచి వ్యక్తి ఉండడు, సంతోషంతో మీకు రాత్రి నిద్ర కూడా పట్టి ఉండదు కదా’ అని కామెంట్లు జత చేస్తున్నారు.































