హీరోయిన్ రాశీ ఖన్నాతో గొడవ కారణం… అసలు విషయం చెప్పిన శ్రీ రాపాక..!

0
214

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన “న గ్నం” సినిమాలో తన అందాలను ఆరబోసి యువత మనసు దోచుకున్న గ్లామర్ బ్యూటీ స్వీటీ అసలు పేరు శ్రీ రాపాక. ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే కాస్ట్యూమ్ డిజైనర్‌గా టాలీవుడ్ లోని అగ్ర హీరోలతోనూ, హీరోయిన్లతోనూ పని చేసింది. తాజాగా ఈమె హీరోయిన్ గా నటించిన న గ్నం చిత్రం విడుదల కావడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. “న గ్నం” మూవీ విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. హీరోయిన్ రాశి ఖన్నాతో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తు చేసుకుంది.

“సుప్రీమ్” సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి రాశీ ఖన్నా నటించింది. ఈ చిత్రానికి శ్రీ రాపాక కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిందట. ఆ సమయంలో ఒకసారి చీర కట్టుకోవడం కోసం హీరోయిన్ రాశీ ఖన్నా తనను పిలిపించిదని, తనకోసం సెట్ కి వెళితే కేరవాన్ బయట చాలా సేపు వెయిట్ చేయించిందట. అసలు క్యాస్ట్యూమ్ డిజైనర్ చీరకత్తానికి వెళ్లాల్సిన పనిలేదు కానీ, రాశి ఖన్నా క్యాస్ట్యూమ్ డిజైనర్ తో నే చీర కట్టించుకుంటానుగా అని పిలిపించిందట. ఆమె కోసం వెళితే ఆమె చాలాసేపు బయట వెయిట్ చేయించిందని, చాలా సేపటి తరువాత గాని ఆమె బయటకు రాలేదని తెలిపింది శ్రీ రాపాక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here