Sri Reddy: వివాదస్పదంగా మాట్లాడటమే కాకుండా మరొకరిని వివాదాల్లోకి లాగే శ్రీరెడ్డి ఏదో ఒక విషయంపై స్పందిస్తుంటుంది. ఇటు యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ మరో వైపు సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పలు విషయాలపై స్పందిస్తుంటుంది. ఇక మెగా ఫ్యామిలీ పై తరచూ విమర్శలు ఎక్కుపెట్టే శ్రీ రెడ్డి ఇటీవల నిహారిక పబ్ ఇష్యూలో నాగబాబును బాగా ఏకిపారేసింది. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిది స్టాలిన్ కూడా వదల్లేదు, ఉదయానిది స్టాలిన్ పై వివాదాస్పద వాఖ్యలు చేసింది.

కరాటే ను ఓ అట ఆడుకున్న శ్రీ రెడ్డి….

ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న వార్త కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఇష్యూ. కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి ఇంటికి పోయి మరీ గొడవపెట్టుకుని అది కాస్త రచ్చ అయి చివరకు ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్ళింది. ఇక ఈ ఇష్యూ పై శ్రీ రెడ్డి స్పందించింది. తన సపోర్ట్ శ్రీకాంత్ రెడ్డి కి ఇచ్చింది. కరాటే కళ్యాణిని బూతులు తిడుతూ రెచ్చిపోయింది.

ఒక చిన్న పిల్లను అడ్డం పెట్టుకుంటావా అంటూ మండి పడింది. కరాటే వచ్చు కదా మరీ ఎందుకు శ్రీకాంత్ ను కొట్టి ముఖానికి అడ్డం పెట్టుకుంటున్నావ్ కొడతాడని చిన్నపిల్లను ముందుకు పెడతావా బుద్ధిలేదా దత్తత తీసుకుంటే పసిపిల్లను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పాపకు ఎక్కడైనా దెబ్బ తగిలితే ఏంటనే జ్ఞానంకూడా లేదా అంటూ రెచ్చిపోయింది. ఇక శ్రీకాంత్ ఒక చిన్న యూట్యూబర్ అని సినిమాల్లో ఐటమ్ సాంగ్ అవన్నీ చూస్తే పొగుడుతారు, అదే శ్రీకాంత్ లాంటి వాళ్లు చేస్తే తప్పవుతుంది అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.































