Sri Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన నటిగా పేరు సంపాదించుకున్న శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతుంటారు. ఈమె మాట్లాడటం మొదలుపెడితే ఎదుట ఎవరున్నారు అనే విషయం కూడా తెలియకుండా ఎడాపెడా మాట్లాడుతూ ఎన్నో వివాదాలకు కారణం అవుతుంటారు.ఇలా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే శ్రీ రెడ్డి తాజాగా స్టార్ కిడ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీ రెడ్డి ఒక వీడియో ద్వారా మా లాంటి స్టార్ కిడ్స్ గురించి అంటూ స్టార్ హీరోల పిల్లల గురించి మాట్లాడారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ పెళ్లి అయిన విడాకులు తీసుకుంటున్నారు అంటే దానికి గల కారణం మేము చేసే తప్పులేనని శ్రీ రెడ్డి వెల్లడించారు.పెద్దల మాటలు వినకుండా మా నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితులలో ఉన్నామని వెల్లడించారు.

ఇక ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ కిడ్స్ కూతుర్లు వివాహమైన తర్వాత విడాకులతో విడిపోతున్నారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణాలు తెలియజేశారు. ఇలా తాను దగ్గుబాటి అభితో కలిసి ఒక పబ్ కి వెళ్ళినప్పుడు ఆ స్టార్ హీరో కూతురు ఫుల్లుగా తాగి పబ్ లో చిందులు వేస్తోందని ఆ మత్తులో వచ్చి అభిని కూడా ముద్దు పెట్టుకుందని తెలిపారు.
మనస్పర్ధలు వస్తే సర్దుకుపోవాలి కానీ…
ఇలా పెళ్లి తర్వాత కూడా ఫ్రెండ్స్ తో చాటింగ్ లు, గ్రూప్ మెసేజ్ లు, పబ్బులు అని తిరగడం వల్ల చాలామంది స్టార్ కిడ్స్ విడాకులు తీసుకుంటున్నారని,ఇలా పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చి మరి విడాకులు తీసుకొని విడిపోతే ఆ బిడ్డకు జీవితంలో ఎలాంటి మెసేజ్ చేస్తారని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి విడాకులు తీసుకున్న స్టార్ హీరోల కూతుర్ల గురించి వెల్లడించారు ఏదైనా మనస్పర్ధలు వస్తే ఒకరికొకరు చర్చించుకొని సర్దుకుపోవాలి కానీ ఇలా విడాకులు తీసుకొని విడిపోతూ చిన్న పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా ఈ సందర్భంగా శ్రీ రెడ్డి చెప్పుకొచ్చారు.




























