శ్రీరెడ్డి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కొన్ని రోజు క్రితం క్యాస్టింగ్ కౌచ్ గురించి తన గొంతును వినిపించింది. దానికి సపోర్టుగా ఎంతో మంది వచ్చి తమ గళాన్ని కూడా వినిపించారు. కానీ తర్వాత ఆ ఉద్యమం నీరుగారిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి మధ్య కొన్ని వివాదస్పత వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అప్పట్లో దీనిపై శ్రీరెడ్డిని పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించిన శ్రీరెడ్డి.. అంతగా వార్తల్లో నిలవలేదనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఆమె మళ్లీ వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాట్లాడిని మాటలకు పోసాని ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దానికి పవన్ అభిమానులు కూడా అతడిపై దాడి చేసే దాకా వెళ్లింది. అతడి ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ పావలా గాడికి ప్యాకేజీ అందినట్టు ఉంది.. ప్రతీ సారి ఇలా ఓ సభను పెట్టి.. పది మంది ఈలలు వేసే బ్యాచ్ ను నడిపిస్తూ.. వాళ్లకు డబ్బులు ఇస్తూ.. హంగామా చేస్తున్నాడు. నీవు తెలంగాణ యూనివర్సిటీలో ఎవరినీ పోషిస్తున్నావో.. ఆ మూకలని పోగు చేసి ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావో అన్నీ తెలుసు.
వివరాలతో సహా అన్ని బయటపెడతా.. ఆ ప్రెస్ మీట్ చూసి ఉరేసుకుంటావో, చస్తావో.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ శ్రీరెడ్డి ఈ వీడియోలో తెలిపింది. కాసేపు కోడి కత్తి అంటావ్.. కాసేపు వేల కోట్లంటావు .. వీటన్నింటికి సమాధానం చెబుతా.. అంటూ తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ప్రస్తుతం వీడియో తెగ వైరల్ గా మారింది.



























