రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది సినీప్రముఖులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి శ్రీరెడ్డి గతంలో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా మరోమారు స్టార్ హీరోయిన్ సమంతపై సెన్సేషనల్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. సమంత ఫోటోలతో వ్యాపారం చేస్తోందంటూ శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల సమంత మాల్దీవుల్లో వెకేషన్ ట్రిప్ కు వెళ్లి అక్కడ దిగిన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. సమంత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సమంత షేర్ చేసిన ఆ ఫోటోల గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ గాయ్స్ ఆ ఫోటోను ఒకసారి పూర్తిగా చూడండి. సమంతకు ఇప్పటికే పెళ్లైందని.. కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉందని.. అయినా ఆమె అందాలను ఆరబోస్తూ వ్యాపారం చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీరెడ్డి చేసిన కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. గతంలో చాలా సందర్భాల్లో సమంతను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా మరోమారు అలాంటి కామెంట్లు చేయడం గమనార్హం. శ్రీరెడ్డి చేసిన కామెంట్లపై సమంత అభిమానులు మండిపడుతున్నారు. సమంత అభిమానుల్లో కొందరు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళుతుందో చూడాల్సి ఉంది.

చెన్నైకు వెళ్లిన తరువాత కొంతకాలం సైలెంట్ అయిన శ్రీరెడ్డి మళ్లీ సమంతను టార్గెట్ చేయడంతో మరి కొంతమందిని కూడా ఆమె టార్గెట్ చేసే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే సమంత మాత్రం ఇలాంటి ట్రోల్స్ ను, నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోదనే సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here