అందానికే అసూయ పుట్టేలా ఉండే హీరోయిన్ సౌందర్య అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. ఆ రోజుల్లో సౌందర్య మిగతా హీరోయిన్స్ గట్టి పోటీ ఇచ్చేవారు. విపరీతమైన పోటీని తట్టుకుని మరీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో దివంగత సౌందర్య ఒకరు అని చెప్పొచ్చు. సౌందర్య అంటే ఫ్యామిలీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రేస్. ఆ రోజుల్లో సౌందర్య పెద్ద హీరోల తోనే కాకుండా చిన్న హీరోలతో కూడా ఎటువంటి స్టార్ హీరోయిన్ అనే పొగరు లేకుండా అలి, బాబు మోహన్ వంటి వారితో కూడా సమానంగా నటించింది మెప్పించేది. అందుకే దర్శకులు ఆమెను డౌన్ టూ ఎర్త్ అంటూ ప్రశంసలతో ముంచెత్తేవారు. కానీ ప్రమాదవశాత్తు ఆమె 2004లో విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది.

అదే విధంగా అతిలోక సుందరి శ్రీదేవి కూడా బాల నటిగా పరిచయమై స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలివుడ్ ని సైతం ఏక కాలంలో ఊపేసిన ఒకేఒక హీరోయిన్ దివంగత శ్రీదేవి. 2018లో దుబాయ్ లో శ్రీదేవి మరణించడంతో సినీ ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయింది. ఇదిలా ఉండగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరోయిన్ లు ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. మన టాలీవుడ్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ, బిగ్ బి అమితాబ్ తో హిందీలో తీసిన సూర్య వంశ్ అనే చిత్రం ద్వారా సౌందర్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అందువల్ల బాలీవుడ్ వారితో కూడా సౌందర్య సన్నిహితంగా ఉండేవారు. ఆ సమయం లోనే శ్రీదేవి భర్త బోని కపూర్ పుట్టినరోజున సౌందర్య, శ్రీదేవి కలిసి తీసుకున్న ఫోటో ఒకటి ఇపుడు బయటకు వచ్చింది. ఆ ఫోటోలో శ్రీదేవి, సౌందర్యలతో పాటూ బోన్ కపూర్ కూడా కనిపిస్తారు.
































