Srihan: యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో సిరి, తన ప్రియుడు శ్రీహాన్ ఒకరు. ఇలా యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది.
బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన రొమాన్స్ కారణంగా పెద్ద ఎత్తున నెగిటివిటీ మూట కట్టుకుంది.

ఇలా బిగ్ బాస్ 5 ద్వారా ఫేమస్ అయినటువంటి సిరి ప్రియుడు శ్రీహాన్ బిగ్ బాస్ 6 కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక ఈయన హౌస్ లో కొనసాగుతూ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లలో బెస్ట్ పెర్ఫార్మర్ వరస్ట్ పెర్ఫార్మర్ చెప్పాలని బిగ్ బాస్ సూచించగా చాలామంది గీతూ,ఇనయా సుల్తానా పేర్లు చెబుతూ రీసన్ చెప్పారు.

ఇనయ సుల్తానా మాత్రం ఓ సందర్భంలో శ్రీహాన్ తో మాట్లాడుతూ తాను హౌస్ లో ఒంటరిగా ఉన్నానని తనకు బయట సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అంటూ బాధపడటమే కాకుండా నీకంటే బయట సిరి ఉంది ఇంకా చాలామంది ఉన్నారు అంటూ సిరి ప్రస్తావన తీసుకువచ్చింది.
Srihan: తన పేరు ప్రస్తావన తీసుకురావద్దు…
ఈ విధంగా ఇనాయా సుల్తానా సిరి పేరు ప్రస్తావన తీసుకురావడంతో ఒక్కసారిగా శ్రీహాన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ మాట్లాడుతూ ఇలా బయట ఉన్న వాళ్ళ పేర్లు గురించి ప్రస్తావన తీసుకురావద్దు అంటూ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలా తన ప్రియురాలి పేరు ఎత్తితేనే శ్రీహాన్ ఇలా మండిపడటం చూసిన ఇనాయా సుల్తానా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.































