Srikanthachari mother Sankaramma : నేటి తరం తాము ప్రత్యక్షంగా చూసిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆంధ్ర పాలకుల నుండి స్వయం పాలన కావాలంటూ మా తెలంగాణకు న్యాయం జరగాలంటూ అభివృద్ధిని కాంక్షిస్తూ పల్లెలు పట్టణాలు ఏకమై ఒకే తాటి మీదకు వచ్చి జై తెలంగాణ అంటూ చేసిన ఉద్యమం. ఎందరో విద్యావేత్తల మార్గదర్శకాలతో ఎందరో విద్యార్థుల బలిదానాలతో నేటి తెలంగాణ కల సాకారమైంది. అలా తెలంగాణ కోసం తన ప్రాణాలను అర్పించిన విద్యార్థి శ్రీకాంతాచారి. ఆయన తెలంగాణ సాధన కోసం ప్రాణాలను విడిచినా ఆయన మరణించాక వచ్చిన తెలంగాణలో ఆయన మరణంకు పాలకులు ఎంత న్యాయం చేశారు, ఆయన స్మారకంగా చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి వంటి ప్రశ్నలకు ఆయన తల్లి శంకరమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఎమ్మెల్సి ఇస్తామని నాకు చెప్పలేదు…
శంకరమ్మను తాజాగా కెసిఆర్ ప్రభుత్వం పిలిచి మాట్లాడటంతో ఆమెకు కెసిఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సి పదవి ఇస్తుందని ఊహాగాణాలు మొదలయ్యాయి. ఇదే విషయం తాజాగా ఒక ఇంటర్వ్యూలో శంకరమ్మ గారిని అడిగినపుడు నాకు ఎమ్మెల్సి ఇస్తున్నట్లు చెప్పలేదు కేవలం మీడియాలో వస్తోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక తన కొడుకు చేసిన త్యాగం గొప్పదని తన ఆశయాల కోసం పదవి లేకపోయినా పోరాడుతనని చెప్పారు.

తన కొడుకు ఆగష్టు 15న పుట్టడం వల్ల చిన్నపటి నుండి సామాజిక సేవ ఎక్కువగా చేసేవాడని, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఎక్కువగా తెలంగాణ గురించి ఆలోచించేవాడని చెప్పారు. అయితే ఇలా తెలంగాణ కోసం కెసిఆర్ ను అరెస్టు చేసారని, చనిపోతాడని అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యారు. తాను ఆత్మాహుతి చేసుకుని కాలిపోయి నాలుగు రోజులు పోరాడాడు. నాకు చెప్పకుండా పిలుచుకెళ్లి చూపించారు. ఎందుకు ఇలా చేసావ్ అనడిగితే అలా అనొద్దు అమ్మ తెలంగాణ వస్తుంది అంటూ మాట్లాడాడు. అదే చివరిమాట నాతో మాట్లాడింది, ఆ పైన తనని నేను చూడలేకపోయానని చెప్పారు. శరీరం బాగా కాలిపోయినా తెలంగాణ వస్తుంది అంటూ అన్నాడు నా కొడుకు, నేడు తెలంగాణ వచ్చిందంటే నా కొడుకులాంటి వాళ్ళ బలిదానాలే కారణం అంటూ చెప్పారు.





























