యాంకర్ శ్రీముఖి, టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. యాంకర్ గా, నటిగా తెలుగు ప్రేక్షకుల ముందు మంచి పేరు తెచ్చుకుంది. సుమ, ఝాన్సీ వంటి సీనియర్ యాంకర్ల తరువాత ఆ స్థాయి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది ఒక్క శ్రీముఖి మాత్రమే. టాలీవుడ్ లోని ఏ ఈవెంట్స్ అయినా సుమ చేయకపోతే ఖచ్చితంగా శ్రీముఖి చేయాల్సిందే. ఈ టీవీ ప్లస్ లో ప్రసారమయ్యే “పటాస్” టీవీ షో తో ఫేమస్ అయింది శ్రీముఖి. ఆ తర్వాత కొన్నీ సినిమాలలో నటించింది. ఒకటి రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. “జులాయి” సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తరువాత సినిమాలకు స్వస్తీ చెప్పింది. బుల్లితెరమీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఆమె అనుకున్నట్టుగానే బుల్లితెరమీద మంచి సక్సెస్ సాధించింది.

ఆ క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ -3 లో అడుగు పెట్టింది. అక్కడకూడా హిట్ ఆయిన్ శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్ గా నిలిచింది. మొన్నఈమధ్య అలీ హోస్ట్ గా వస్తున్న “అలీతో సరదాగా…” టీవీ షో లో యాంకర్ రవితో కలిసి శ్రీముఖి పాల్గొంది. అయితే హీరోయిన్ అవ్వాలని వచ్చిన శ్రీముఖి కేవలం రెండు మూడు సినెమాలకే ఎందుకు పరిమితమవ్వాల్సి వచ్చింది అని ఆలీ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది శ్రీముఖి.

“జులాయి సినిమా చేస్తున్న సమయంలోనే నాన్నగారు సినిమాలు చేయొద్దని గట్టిగా చెప్పారు. ఆ సినిమానే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అవ్వాలని ఆర్డర్ వేశారు. అయినా సరే నాన్నగారి మాట వినకుండా జులాయి తరువాత రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా నటించాను. ఆ తరువాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసాను. ఆ తరువాతే టీవీ షోలు చేయడం మొదలుపెట్టాను” అని చెప్పుకొచ్చింది.

“అయితే జులాయి సినిమా చేస్తున్న సమయంలో “నువ్వు టీవీ షోలు చేస్తే సినిమా అవకాశాలు రావు ని త్రివిక్రమ్ గారు చెప్పారు. నిజంగా అయన అన్నట్టుగానే జరిగింది. ఆ తరువాత టీవీలో షోలు చేస్తున్న సమయంలో ఒకటి రెండు సినిమా ఛాన్స్ లు వచ్చాయి కానీ అవి చిన్న సినిమాలు అయినా సరే చేద్దాంలే అనుకున్నా… ఎక్స్పోజింగ్ చేయాలి… లిప్ లాక్ ఇవ్వాలి అని రకరకాల కండీషన్స్ పెట్టడంతో ఇక సినిమాలు వద్దనుకున్నాను. ఇక ఇప్పుడు అయితే టీవీ షోలలో బిజీ బిజీ గా ఉంటున్నాను అసలు సినిమాల గురించి పట్టించుకునేంత తీరిక లేదు.” అని చెప్పింది శ్రీముఖి.




























