బుల్లితెర టీవీ యాంకర్లలో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్, లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న యాంకర్లలో ప్రదీప్, శ్రీముఖి ముందువరసలో ఉంటారు. పెళ్లి కాని ఈ ఇద్దరు యాంకర్ల పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 22వ తేదీన వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుంది. షాక్ అవుతున్నారా…? వీళ్లిద్దరూ జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఒక షోలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇది రీల్ పెళ్లే తప్ప రియల్ పెళ్లి కాదులెండి.

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని టీవీ ఛానెళ్లు ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తున్నాయి. అయితే రొటీన్ గా ఉంటే ప్రేక్షకులను అట్రాక్ట్ చేయలేమని భావించి ఛానెల్ నిర్వాహకులు ఇలాంటి ప్రోగ్రామ్ లను క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ఒక ప్రముఖ ఛానల్ రష్మీ సుధీర్ లకు కూడా ఇదే విధంగా ప్రోగ్రామ్ లో పెళ్లి చేసింది. క్రియేటివిటీ పేరుతో ఛానల్ నిర్వాహకులు చేస్తున్న ఇలాంటి ప్రయోగాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దసరా పండగ నేపథ్యంలో జీ తెలుగు ఈ వింత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జెమిని మినహా ఇతర ఛానల్స్ కూడా ఈ తరహా ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తున్నాయి. ”ఈ లేఖలో ఏముందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి దసరా స్పెషల్ ఈవెంట్” అంటూ జీ తెలుగు పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం ఈ పెళ్లి పత్రిక చూసి టీవీ ఛానెళ్లు ఈ మధ్య పెళ్లిళ్లు కూడా చేస్తున్నాయా..? అని కామెంట్లు చేస్తున్నారు.

టీఆర్పీ కోసం అన్ని ఛానళ్లు చేస్తున్న ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు సక్సెస్ అవుతుంటే మరికొన్ని సార్లు ఫ్లాప్ అవుతున్నాయి. మరి జీతెలుగు చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేక ఫ్లాప్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here