టాలీవుడ్ భల్లాలదేవ హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమా కూడా తీయకపోయినా వెండితెరపై కనిపించక పోయినా కూడా చాలా ఫేమసైపోయాడు. అయితే ఎవరూ ఊహించనివిధంగా ఒక్కసారిగా అభిరామ్ కు కారు ప్రమాదం జరిగిందని వచ్చిన రూమర్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

లేటెస్ట్ గా ఆ రూమర్స్ ను కొట్టి పారేస్తూ.. ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్ కూ ఎలాంటి సంబంధం లేదని, ఆ కారు అసలు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాదని దగ్గుబాటి సురేష్ కూడా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇవన్నీ గమనించిన శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. ఆ మధ్య ఐటీ దాడులు జరిగినప్పుడు కూడా ఇలానే స్పందించింది. అన్నపూర్ణ స్టూడియో, రానా, వెంకటేష్, నాని కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై చేసిన పాపం ఊరికనే పోదంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. గతంలో కూడా శ్రీరెడ్డితో రాసలీలను కొనసాగిస్తూ.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు అభిరామ్. శ్రీరెడ్డితో ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అప్పట్లో వీళ్ళిద్దరి టాపిక్ పెద్ద సంచలనమే సృష్టించింది. అప్పటినుంచి అవకాశం దొరికినప్పుడల్లా శ్రీరెడ్డి అభిరామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. తాజాగా అభిరామ్ కారుకు ప్రమాదం అనగానే ఓ వీడియోను రిలీజ్ చేసింది.

ఈ సందర్భంగా దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదం రూమర్స్ పై శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘అభి నీకు గుర్తుందా.? నీ కారెంత.? నీ స్థాయెంత.? నేను రానా తమ్ముడిని.? టాలీవుడ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకును.? రామా నాయుడు మనవడిని.? అనుకుంటున్నావేమో.?! గతం మర్చిపోయినట్టున్నావ్.. నన్ను అవమానపరిచేలా నీదో డొక్కు కారు? నువ్ ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్ వి అని అన్నావే? నన్ను, నా కార్‌ను హేళన చేశావే..?! మరి ఈ రోజు ఏమైంది..? నీ కారుకు యాక్సిడెంట్ అయినట్టుంది. అందుకే మళ్ళీ చెబుతున్నాను.. దేవుడు ఉన్నాడ్రా.. దేవుడు ఉన్నాడు ఎప్పుడూ నీ బ్యాక్ గ్రౌండ్ ను చూసి గర్వపడకు.. ఈ డబ్బులు, పేరు, అందం అన్నీ అశాశ్వతం.. శాశ్వతమైనవి కొన్నే.. అవే మంచితనం, మంచి పేరు తోటివాళ్ళని అర్థం చేసుకోవడం ఎదుటివాళ్లకు హాని చేయకుండా మంచిగా ప్రవర్తించటం. నేనైతే పెద్ద ఉత్తమురాలిని కాకపోవచ్చు గానీ చాలావరకూ మంచినే ఫాలో అవుతున్నాను.. నేర్చుకుంటున్నాను’ అని కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అభిరామ్ పై శ్రీరెడ్డి చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.



























