సినిమా లైఫ్‌లో నెగెటివ్‌ షేడ్స్‌ వున్న విలన్.. రియల్‌ లైఫ్‌లోకి వచ్చేసరికి రియల్‌ హీరో. అవును కరోనా కష్ట కాలంలో కలియుగ కర్ణుడి అవతారమెత్తారు సోనూ సూద్‌. అరుంధతి, దూకుడు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్ నటుడిగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేసినా నిజ జీవితంలో మాత్రం చాలా మంది జీవితంలో హీరో పాత్రనే పోషించాడు. వేలాది మంది వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించి రియల్ లైఫ్‌ లో సుప్రీమ్ హీరో అయ్యారు. వలస కూలీల కష్టాలకు చలించి పోయి సొంత డబ్బుతో వారిని ఇళ్లకు చేర్చి అందరి ప్రశంసలను పొందారు. అక్కడితో ఆగిపోకుండా లాక్‌డౌన్ టైంలో విదేశాల్లో చిక్కుకున్న 1500 మంది విద్యార్థులను ఇండియాకు తరలించేందుకు సిద్ధపడ్డారు. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు స్పందించేలోపే బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళని తమ సొంత గూటికి పంపించారు. ప్రతీ వలస కార్మికుడు తమ ఇంటికి చేరే వరకు ఆగేది లేదనే సత్సంకల్పంతో రంగంలోకి దూకాడు ఈ రియల్ హీరో.

వలస కార్మికుల విషయంలోనే కాదు సమస్యల్లో ఉన్న ఎవరైనా సహాయం అడిగితే కాదని అనకుండా వెంటనే చేసి చూపించడం సోనూసూద్ స్పెషాలిటీ. అలా సహాయం అడిగిన ఒక చిన్నారికి మీ ఇంటి పైకప్పు నుంచి ఇక నీరు కారదు అని చెప్పి చేసి చూపించాడు సోనూసూద్. ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపిన సోనూసూద్ ముంబైలోని తన హోటల్ ను మొత్తం కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించే వైద్యులు, సిబ్బందికి కేటాయించారు. వలస కార్మికులు తమ ఇంటికి వెళ్లేలా చేయడమే కాదు వాళ్ళకి జీవనోపాధి కల్పించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ రియల్ హీరో. ప్రస్తుతం మరో మిషన్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు సోనూ సూద్.

అలాంటి సోనూ సూద్‌ పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోక సెన్సేషన్ క్రియేట్ చేసే శ్రీ రెడ్డి మనసు పారేసుకున్నట్లుంది. గత కొన్ని రోజులుగా సైలెంట్‌‌గా ఉంటున్న శ్రీ రెడ్డి, తాజాగా సోనూసూద్‌ హీరోయిజాన్ని పొగుడుతూ.. కరోనా లాక్ డౌన్ టైంలో ఆయన చేస్తున్న సేవలపై స్పందించి ఒక్కసారిగా ‘లవ్ యూ’ అనేసింది. సోనూ సూద్‌ ఫోటోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన శ్రీ రెడ్డి.. ‘సోనూసూద్ హాట్ మాత్రమే కాదు బాబోయ్.. మంచి హార్ట్ ఉన్నవాడు కూడా.. మీరంటే ఎంతో ప్రేమ ఉంది. ఐ లవ్ యూ.. మీకు భవిష్యత్‌ లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్..” అంటూ ట్యాగ్ చేసింది. దీంతో శ్రీరెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి మంచి స్పందననే రాబడుతుంది. ‘మొట్ట మొదటిసారిగా నీ నుంచి మంచి మాటలు రావడం చూశాం’ అంటూ శ్రీరెడ్డిపై నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఏదేమైనా సోనూ సూద్ సామాజిక సేవను చూసిన శ్రీ రెడ్డి ఫిదా అయిపోయిందన్న మాట నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here