“శ్రీరెడ్డి” ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు. క్యాస్టింగ్ కౌచ్ తో మొదలుపెట్టి నిన్న మొన్నటి ఎంపి రఘురామా కృష్ణమరాజు వరకు అందరిమీద నోరు పారేసుకోవడం వరకు ఈ అమ్మడు బాగోతం అందరికి తెలిసిందే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి సందర్బం ఉన్నా, లేకపోయినా మెగా హీరోలను మాత్రం ఒక ఆటాడేసుకుంటుంది. నిత్యం ఏవో ఒక విమర్శలు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి అంటే మరీ దారుణమైన కామెంట్లు చేస్తుంది.

తాజగా కరాటే కల్యాణి, పావలా శ్యామల మధ్య వివాదం జరుగుతున్నా నేపధ్యంలో మరో సారి తెరమీదకి వచ్చింది శ్రీరెడ్డి. పావలా శ్యామల దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం చూస్తున్న సమయంలో చిరంజీవి లక్ష రూపాయిలు ఇవ్వడంతో పాటు మాలో మెంబర్ షిప్ కార్డ్ కూడా ఇప్పించి నెలకు ఆరు వేల రూపాయిలు వచ్చేలా చేసారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కరాటే కల్యాణి పాత్ర కీలకంగా మారింది. కరాటే కల్యాణి అందరి దగ్గర విరాళాలు సేకరించి పావలా శ్యామలకు అందించారు. అయితే తాజగా పావలా శ్యామల చేస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
వీరిద్దరి మధ్య మాటల యుద్ధం అలా నడుస్తుండగానే మధ్యలో సడన్ గా ఎంట్రి ఇచ్చింది శ్రీ రెడ్డి. చిరంజీవి, కరాటే కల్యాణి గురించి దారుణమైన కామెంట్స్ చేసింది. “చిరంజీవి తాత సరదాగా కరాటే కుక్కని వీధిలోకి వాకింగ్ కి తీసుకోచ్చాడెంటో.. బాగా చిరంజీవి బాబీ ని.. **** ఛి ఛి” అంటూ వినలేని పదాలతో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసింది.

దేనిపై కరాటే కల్యాణి ఘాటు రిప్లై కూడా ఇచ్చింది. శ్రీ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఘాటు కౌంటర్ ఇచ్చింది.. “పొట్టి కుంచం నేను నీ పక్కన నిల్చుంటే ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడి చూడాలి. నువ్వు అన్నీ అతికించుకునే మాట్లాడే పెట్టుడు.. పులకా. పిచ్చి కుక్క ఎవరో జనాలందరికీ తెలుసు జనాలు పిచ్చోళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి గురించి మాట్లాడటానికి నీకు అర్హతలేని పిచ్చి కుక్క మూసుకుని పోవే బోరింగు పాప. ఇంకోసారి మాట్లాడితే ముక్కు మొహం ఏకం చేస్తా.. నాతొ పెట్టుకున్నావు కుక్క గొలుసు నీ మేడలో వేసి నీ మద్దతు వచ్చే వారితో కలిసి వాకింగ్ కి తీసుకెళ్తా.. పెడిగ్రీ తిని బాగా మొరిగే కుక్క ఛి ఛి అవతలికి పోవే అసలు నీమొహం చూడడానికే అసహ్యం వస్తుంది..కుక్క మొహమా..” అంటూ కరాటే కల్యాణి పోస్ట్ చేసింది.































