శృతి హాసన్ తెలుగునాట పరిచయం అవసరం లేని పేరు… కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయమై… కథానాయికగా, గాయనిగా మల్టీ టాలెంటెడ్ ఈ స్టార్ డాటర్… చాలా నిర్మొహమాటంగా మాట్లాడే ఈ ముద్దుగుమ్మ. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. అయితే తనకు మద్యంతాగే అలవాటు ఉన్న విషయాన్నీ ఇదివరకే బయటపెట్టిన విషయం తెలిసిందే. ఒక షోలో ఆమె స్వయంగా వెల్లడించింది. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించిన శృతి హాసన్. తాను తాగడం మానేశానని స్పష్టం చేసింది శృతి..

అసలు విషయానికి వస్తే… ఒక రోజు అనుకోకుండా ఎక్కువగా తాగేసానని… అప్పటి నుంచి మళ్ళీ తాగొద్దని డిసైడ్ అయ్యానని తెలిపింది శృతిహాసన్. అయితే తాగడం మానేసిన తరువాత తనకు చాలా ప్రశాంతంగా ఉందని. లైఫ్ చాలా మెరుగ్గా అనిపిస్తోందని చెప్పింది. కానీ ఒక మగవాడు మద్యం తాగితే ఎవరు పట్టించుకోరు కానీ అదే ఒక అమ్మాయి తాగితే మాత్రం దాన్ని పెద్ద దుమారం రేపుతారని. అది నన్ను చాలా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది శృతిహాసన్.




























