సంక్రాంతికి వచ్చిన “సరిలేరు నీకెవ్వరూ” సూపర్ హిట్ అందుకున్న తరువాత ఇప్పటి వరకు మరో సినిమాకు పట్టాలెక్కించలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తరువాత డైరెక్టర్ వంశి పైడిపల్లి సినిమా అనుకున్నా అది డిస్కషన్స్ దగ్గరే ఆగిపోయింది. మహేష్ బాబుకు కద నచ్చకపోవడంతో ఆ సినిమాకు బ్రేక్ పడిందని తెలుస్తుంది. అయితే తాజగా గీతగోవిందంతో అదిరిపోయే హిట్ అందుకున్న పరశురామ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో అయన దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు ఒకే చెప్పాడట.

ఈ సినిమా సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తిచేసుకున్నాడట ఈ డైరెక్టర్. మహేష్ కోసం కమర్షియల్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసాడట డైరెక్టర్ పరశురామ్. ఈ చిత్రంలో హీరోయిన్స్ కోసం అన్వేస్టిస్తూ మహేష్ బాబు సరసన ఎవరైతే బాగుంటారని వెతికేపనిలో పడ్డారట చిత్రయూనిట్. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె “సారా అలీ ఖాన్” నటించబోతోండి అనే వార్త టాలీవుడ్ వర్గాలనుంచి వినిపిస్తుంది. మరో పక్క కీర్తి సురేష్, కియారా అద్వానీ లను కూడా పరిశీలిస్తున్నారట. దాదాపుగా సారా అలీ ఖాన్ కె చిత్రయూనిట్ ఫిక్స్ అయిందని సమాచారం. అయితే సారా, కీర్తి, కియారా లలో ఎవరు సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయబోతున్నారని ఫ్యాన్స్ మాత్రం ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ ముగియగానే చిత్ర షూటింగ్ మొదలుకానుంది.





























