Star Heroin:సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతోమంది నటీమణులు బయట పెడుతూ వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి తెలియజేశారు. ఇలా ఎంతోమంది వల్ల తాము ఇబ్బంది పడ్డాం అంటూ ఈ సందర్భంగా క్యాస్టింగ్ ఇబ్బందులను బయటపెడుతూ ఎమోషనల్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు తమిళ హిందీ భాషలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి సీనియర్ నటి టబు గురించి అందరికీ సుపరిచితమే.

కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నప్పుడు పాత హీరోయిన్లు కనుమరుగవడం సర్వసాధారణం అయితే ఎంతో మంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ టబు మాత్రం ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ ఇప్పటికీ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా టబు పుట్టినరోజు జరుపుకోవడంతో తన జీవితంలో జరిగినటువంటి ఒక చేదు సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.
టబు గతంలో తన పుట్టినరోజు సందర్భంగా తన సోదరి ఫరా నాజ్ తో కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్ళిందట.ఆ టైంలో నటుడు జాకీ ష్రాఫ్ ఫుల్లుగా మద్యం తాగి నటి టబుతో అనుచితంగా ప్రవర్తించారని, తనని తాకరాని చోట తాకుతూ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈమె వెల్లడించారు.తాను స్టార్ హీరో కావడంతో తాను కూడా ఏమి మాట్లాడకుండా ఉన్నప్పటికీ ఆయన మాత్రం క్రమక్రమంగా తనని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడంటూ ఈమె తెలియజేశారు.

Star Heroin: ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించాడు…
ఈ విధంగా నటుడు జాకీ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా తాను మాత్రం తనని పక్కకు తోసేసి అక్కడి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో చుట్టూ ఎంతోమంది ఉన్నప్పటికీ తాను మాత్రం జరిగిన విషయాన్ని బయట పెట్టలేదని తన పుట్టినరోజు సందర్భంగా ఆ చీకటి రోజున ఈమె గుర్తు చేసుకున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె పలు బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
































