Star Heroins : సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలో ముందుకు కొనసాగాలంటే ఎన్నో త్యాగాలను చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం మనగడ ఉండదు. ఈ క్రమంలోనే హీరోయిన్లుగా ఉన్న సమయంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలంటే గ్లామర్ షో చేయడం తప్పనిసరి.

అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తే తప్ప వారికి అవకాశాలు వచ్చే దాఖలాలు కనపడడం లేదు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు మాత్రం ఎలాంటి గ్లామర్ షోస్ లేకుండా ఇండస్ట్రీలో అగ్రతారలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చిన గ్లామర్ షో మాత్రం చెయ్యమని తెగేసి చెబుతున్నారు. ఇలా గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన హీరోయిన్లు ఎవరు అనే విషయానికి వస్తే….

సౌందర్య: అలనాటి అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కన్నడ పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ ఎంతో సాంప్రదాయపద్ధంగా చీరలు కట్టుకొని అచ్చమైన తెలుగు అమ్మాయిల ప్రతి సినిమాల్లో నటిస్తూ ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇలా తెలుగులో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు మిగిలింది.

లయ: తెలుగు చిత్ర పరిశ్రమలో లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కూడా ఎలాంటి స్కిన్ షో చేయకుండా కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామన్నా కానీ సినిమాల నుంచి తప్పుకున్నారు తప్ప స్కిన్ షో చేయడానికి ఒప్పుకోలేదు.

స్నేహ: సౌందర్య మరణం తర్వాత ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ అచ్చం సౌందర్య లాగే కట్టుబొట్టుతో ఆమెను తలపించారు. అయితే ఈమె కూడా ఎలాంటి స్కిన్ షో చేయకుండా ప్రేక్షకులను సందడి చేసినప్పటికీ కొంతకాలం మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగారు.

నిత్యామీనన్: మలయాళీ ముద్దుగుమ్మ నిత్య మీనన్ సైతం స్కిన్ షో కి దూరంగా ఉండే సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇదే కోవలోకి నటి కీర్తి సురేష్ కూడా వస్తారని చెప్పాలి. ఈమె కూడా మితిమీరిన స్కిన్ షో చేయకుండా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

సాయి పల్లవి:
ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి గ్లామర్ షోకు పూర్తిగా వ్యతిరేకి. ఈమె గ్లామర్ షో చేయాల్సి వస్తే తాను ఇండస్ట్రీకి దూరం అవుతానా కానీ గ్లామర్ షో మాత్రం చేయనని ఖరాఖండిగా చెప్పారు.గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా ఈ నటీమణులు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
































