దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా కొన్ని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మినహాయింపు ఇవ్వడంతో ఈకామర్స్ సంస్థలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో పలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో నేటి నుంచి తమ అమ్మకాలు మొదలుపెట్టాయి ఈకామర్స్ సంస్థలు. అయితే కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే వినియోగదారులకు మాత్రమే తమ అమ్మకాలు స్టార్ట్ చేయనున్నాయి. రెడ్ జోన్లలో ఉండే వినియోగదారులకు మాత్రం మరి కాస్త సమయం వేచి చూడక తప్పదు.

ఈ నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలు తమ డెలివరీ బాయ్స్ కు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారుడికి వస్తువు డెలివెరీ చేసేందుకు వీలయితే ఇంటి బయటే డెలివరీ చేసేలా పలు సూచనలు చేసారు. ఈ నేపధ్యంలో సాధారణంగా పట్టే డెలివరీ సమయం కంటే.. మరికాస్త ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపాయి.




























