సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఎన్ని విధాలుగా కష్టపడాలో అన్ని విధాలుగా కష్టపడతారు. ఛాలెంజింగ్ రోల్స్ ఇచ్చినా ఎంతో శ్రమించి చేస్తారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకి తగ్గ న్యాయం చేస్తారు. కానీ ఎందుకనో వారికి తగిన గుర్తింపు మాత్రం రాదు. వరుసగా అవకాశాలు వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తున్నా కూడా స్టార్ స్టేటస్ అందుకోవడంలో మాత్రం వెనకబడి పోతుంటారు. నటన రాని కొంతమంది ముంబై హీరోయిన్స్ కంటే పదిరెట్లు బెటర్ అనిపించుకున్నా పెద్ద హీరోలతో నటించే అవకాశాలను అందుకోవడంలో విఫలమవుతుంటారు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అనే సామెత మాదిరిగా కొంతమంది కెరీర్ లో పైకి రావడానికి కిందా మీదా పడుతుంటారు.

అలాంటి అమ్మాయి నివేతా పేతురాజ్. టాలీవుడ్ సినిమాలలో మంచి పాత్రలే చేస్తోంది. అందం, అభినయం కూడా బాగానే ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మది’లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ యంగ్ బ్యూటి. హాట్ హాట్ అందాలతో నివేతా పేతురాజ్ మొదటి సినిమాతో బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన బాగానే రొమాన్స్ సీన్స్ లో నటించి ఇండస్ట్రీ దృష్ఠిని బాగానే ఆకట్టుకుంది.

‘మెంటల్ మది’లో సినిమా తర్వాత నివేతా పేతురాజ్ కి సాయి ధరమ్ తేజ్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ వార్త చూడగానే.. ఈమె మెగా ఫ్యామిలీలో పడిందంటే ఇక దశ దిశ తిరిగినట్టే అనుకున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్ర లహరి’లో సెకండ్ లీడ్ గా నటించింది. కానీ ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ నివేతా పేతురాజ్ కి అంతగా దక్కలేదు. ఇక మరోసారి శ్రీ విష్ణు నటించిన ‘బ్రోచేవారేవరురా..’ లో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో బాగానే అదరగొట్టింది నివేతా పేతురాజ్.

కానీ క్రెడిట్ మొత్తం నివేత థామస్‌కే వెళ్ళిపోయింది. అయినా ఈ హాట్ బ్యూటీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ లో నటించి బంగారం లాంటి అవకాశం అందుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా అంటే ఖచ్చితంగా ఎంతో కొంత పాపులారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ పూజా హెగ్డే తప్ప ఈమె ఎవరి కంటీ కనిపించలేదు పాపం.

ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన మంచి రీల్ చేసింది. పోలీస్ పాత్రలో బాగా ఆకట్టుకుంది. కానీ హీరోయిన్ పాత్ర కాకపోవడం, గ్లామర్ గా చేయడానికి ఒక్క పాట కూడా లేకపోవడం నివేతా పేతురాజ్ కి రెడ్ సినిమా అంతగా ఉపయోగపడలేదు. ఇక తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ సరన పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నివేతా పేతురాజ్. ఈ సినిమాతోనైనా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారుతుందా చూడాలి.




























