రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా కి వినోద్ బాలతో రిహార్సల్స్ చేసి తర్వాత హ్యాండ్ ఇచ్చారో తెలుసా.?!

0
271

మాసిపోయిన గడ్డంతో విలన్ ల కనిపించే ఈయన మృదుస్వభావి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన వినోద్ బాల నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకొని టీవీ రంగం వైపు మొగ్గు చూపడం జరిగింది. తన ఏరోనాటిక్స్ కోర్సు పూర్తయిన తర్వాత హైదరాబాద్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ తర్వాత రంగస్థల అధ్యాపకుడిగా పనిచేశారు. 1989 లో ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన గండిపేట రహస్యం చిత్రంతో తెరంగేట్రం చేశారు.

ఆ తర్వాత 1991లో ఉషాకిరణ్ మూవీస్ వారు తీసిన పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాలో భానుప్రియ తమ్ముడిగా నటించారు. ఆ తర్వాత లాఠీ, వారసుడు, తొలిపొద్దు, కన్యాదానం, మనోహరం లాంటి చిత్రాల్లో వినోద్ బాల నటించారు. వినోద్ బాల ను వెండితెర ప్రేక్షకులకంటే బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. బుల్లితెర సంఘానికి అధ్యక్షునిగా వినోద్ బాల వ్యవహరించడం జరిగింది. మంజుల నాయుడు దర్శకత్వం వహించిన ఋతురాగాలు లో ఒక విభిన్నమైన పాత్ర వినోద్ బాల ధరించారు. ఆ సీరియల్ బాగా హిట్ కావడంతో ఆ తర్వాత అనేక సీరియల్స్ లో అవకాశం రావడం జరిగింది. కస్తూరి సీరియల్ లో వినోద్ బాల నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నారు.

అయితే 1989 ఆ ప్రాంతంలో వినోద్ బాల దూరదర్శన్ టెలీ ఫిలింస్ లో నటిస్తూ ఉండేవాడు. వినోద్ బాల టెలివిజన్ లో నటిస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళినా రాంగోపాల్ వర్మ అన్నపూర్ణ బ్యానర్ లో ఒక సినిమా చేసే అవకాశం వచ్చిందని అయితే ఇంకా మద్రాసు నుండి హైదరాబాదుకు సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ కాకపోవడంతో హైదరాబాదులో నటీనటుల కొరత ఉందని తన సినిమాకి కొంతమంది నటులు కావాలని ఆర్జీవి వినోద్ బాలను అడగడం జరిగింది. అప్పుడు వినోద్ బాల సరే అని చెప్పి… మరొకసారి వారిద్దరూ కలిసినప్పుడు అన్నపూర్ణ స్టూడియో లో శివ సినిమా తీసే కంటే ముందు హీరోగా వినోద్ బాల పై ట్రయల్ షూట్ చేశారని కానీ శివ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకు ఎలాంటి పిలుపు రాలేదని వినోద్ బాల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వినోద్ బాల ఎవరో నాకు తెలియదు అంటూ రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యులో చెప్పారు. ఇందులో ఎవరు చెప్పేది నిజమో ఆ పెరుమాళ్ళకెరుక..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here