కేవలం టాలీవుడ్ పరిశ్రమ మాత్రమే కాకుండా భారతదేశ చలనచిత్ర రంగంలో ఎంతో మంది హీరో హీరోయిన్స్ కు లక్కీ గాడ్ ఫాదర్ ఉన్నవారే. ఈ విషయాన్ని ప్రతి సినిమా అభిమాని ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రతి ఇండస్ట్రీ లో చాలా తక్కువగా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సరే వారు సినిమాలలో ఒక మెట్టు ఎదిగి ప్రస్తుతం హీరోలుగా చలామణి అవుతున్నారు.

ఇకపోతే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ఎదిగిన హీరో ఎవరు అంటే సత్యదేవ్ అనే పేరు వినిపిస్తుంది. విశాఖపట్నం లో పుట్టి పెరిగి కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత సత్యదేవ్ బెంగళూరు నగరంలోని ఐబీఎం కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు. ఆయనకు సినిమాల పట్ల విపరీతమైన ఇష్టం ఉండడంతో సెలవు లభించే శని, ఆదివారాల్లో బెంగళూరు నుండి హైదరాబాదుకు వచ్చి మరి ఏ చిన్న ఆడిషన్స్ జరిగినా అక్కడికి వెళ్లి అటెండ్ అయ్యాడు. అయితే 2016 సంవత్సరంలో ఆయన ఉద్యోగం నుండి పూర్తిగా తప్పుకొని ఈ చిన్న పాత్రలు వచ్చినా సరే సినిమాలో నటించడానికి మొహమాటపడకుండా అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు. ఇలా ఆయన తాను చేసిన ప్రతి క్యారెక్టర్ ను తన విజయానికి ఒక మెట్టు గా మార్చుకొని ఎవరు గమనించ లేని పాత్రలను సైతం చేసుకుంటూ ముందుకు కదిలాడు.

సత్య దేవ్ మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో, అలాగే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ తో దెబ్బలు తినే పాత్రలో కూడా ఆయన నటించాడు. ముకుంద సినిమా లో వరుణ్ తేజ్ స్నేహితుడుగా కూడా నటించాడు. ఆ తర్వాత ఏకంగా 500 మంది ఆర్టిస్టులను ఆడిషన్స్ చేయగా జ్యోతిలక్ష్మి సినిమా కు లీడ్ రోల్ కుసెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమాలో చార్మి క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నప్పటికీ సత్యదేవ్ తన పాత్ర మేరకు బాగా నటించి మంచి మార్కులు పొందగలిగాడు. ఆ తర్వాత చాలా సినిమాలలో మెయిన్ రోల్ చేయకపోయినా సరే పెద్దపెద్ద హీరోల సరసన నటించగలిగాడు. ఓటిటి ఫ్లాట్ఫామ్ లో విడుదల అయిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా వరకు సత్యదేవ్ మెయిన్ హీరోగా ఏ సినిమాలో కూడా నటించలేదు.

అయితే ఆయన నటనకు మాత్రం మంచి మార్కులు పడుతూనే ఉన్నాయి. ఇదివరకు బ్లఫ్ మాస్టర్ అనే సినిమా ను తెరకెక్కించిన అది పెద్దగా ఆడకపోవడంతో నిరాశ పడ్డాడు. కరోనా సమయంలో నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ఫామ్ ద్వారా ఉమామహేశ్వర ఉగ్రరూపం సినిమాతో మంచి మార్కులను సంపాదించాడు. ఆ తర్వాత కూడా జి ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో కూడా 47 డేస్ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్, సరిలేరు నీకెవ్వరు, అంతరిక్షం, ఘాజీ ఎటాక్, బ్రోచేవారెవరురా అలాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన అవి ఆయన విజయానికి మెట్ల లాగా ఉపయోగించుకున్నారు. ఈయన కేవలం దక్షిణ భారతదేశ సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. సత్య దేవ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి విజయం సాధించాడు. తాజాగా అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్ ద్వారా విడుదలైన ఆకాశమే హద్దు అనే సినిమాకు తెలుగు వర్షన్ లో హీరో సూర్యకు గాత్ర దానం చేశాడు.

సత్యదేవ్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లను సైతం వదలట్లేదు. గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్డ్ అనే రెండు వెబ్ సిరీస్ లలో నటించిన అవి కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇకపోతే హీరో సత్యదేవ్ కృషి వెనకాల అతడి భార్య దీపిక కృషి, తోడ్పాటు మాత్రం ఎంతో దాగి ఉంది. ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎంతో కష్టపడి కేవలం వారాంతరంలో బెంగళూరు నుండి హైదరాబాదుకు వచ్చి సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే ఆయన తిప్పలు చూడలేక సత్యదేవ్ కి ఉద్యోగం వదిలి వేయమని కుటుంబాన్ని మొత్తం చూసుకుంటానని ఆవిడ ఆయనకు భరోసా ఇచ్చింది. సతీదేవ్ భార్య దీపిక ఓ ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొని సత్యదేవ్ విజయంలో కీలక పాత్ర పోషించిఇది. ఈమె విషయంలో హీరో సత్యదేవ్ ఈ ప్రపంచంలో తాను ప్రేమించి గౌరవించేది తన భార్యను మాత్రమే అంటూ గర్వంగా చెప్తాడు. ప్రస్తుతం సత్యదేవ్ ఇక గుర్తుందా శీతాకాలం అనే సినిమా లో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here