ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చిత్ర పరిశ్రమతో పాటు అన్ని రంగాల్లో కూడా సంక్షోభం ఏర్పడింది. అయితే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థలు కొందరు ప్రముఖులు గా ఏర్పడి సినీ కార్మికులు అందరికీ వారు సహాయం చేశారు. వారు సంక్షోభానికి గురి అవకుండా సహాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఒక సంగతి గుర్తుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు సహాయ చర్యలు తీసుకుంటున్నట్లు… గతంలో కూడా ఇలాంటి సహాయ చర్యలు ఉండి ఉంటే సాంకేతిక నిపుణులు ఆర్థిక సంక్షోభం వల్ల చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉండేది కదా.

అలాంటి పరిస్థితుల్లో ఉన్న మొట్టమొదటిగా గుర్తు వచ్చే అలనాటి హీరోయిన్ మాలతి. హీరోయిన్ మాలతి అంటే పాతాళభైరవి హీరోయిన్ అంటే గుర్తుకు వస్తుందేమో… ఎందుకు అంటే ఆ రోజులలో పాతాళభైరవి సినిమా విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయ ప్రొడక్షన్స్ వారు తీసిన రెండో చిత్రం. పాతాళభైరవి సినిమా కంటే ముందుగా విజయ ప్రొడక్షన్స్ గురించి కొన్ని విషయాలు.. 1950లో చాలా ఉదాత్తమైన ఆశయాలతో షావుకారు అనే సినిమా తీయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ చేశారు. సినిమాలో హీరోయిన్ గా జానకి నటించారు. ఇక జానకి ఈ సినిమాతోనే షావుకారు జానకి గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ సొంతం చేసుకున్న ఎందుకో డబ్బులు కలెక్షన్ ఎక్కువ లేదు. దానితో నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి గారు నిరాశకు గురి అయ్యారు. అప్పుడు వారు అనుకున్నది ఏమిటి అంటే మనకు నచ్చినది ప్రేక్షకులను మెప్పించడం అంటే, ప్రేక్షకులకు నచ్చింది మనము అందించాలి అని ఆలోచించడం జరిగింది. అదే భావనతో పాతాళభైరవి పింగళి నాగేంద్ర గారు రాయడం, ఇక ఆ సినిమా లో పుష్కలమైన వినోద అంశాలు ఉండడం ఫైటింగ్ లు, రొమాన్స్ అన్ని బాగా కుదరడంతో అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

ఇక ఏదైనా సినిమా సూపర్ హిట్ అందుకున్న తర్వాత అందులోని నటీనటులకు మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటాము. కానీ, పాతాళభైరవి విషయంలో అలా జరగలేదు. ఉదాహరణకు ఎన్టీఆర్ గారికి, ఎస్వీ రంగారావు గారికి అవకాశాలు… కానీ రాజకుమారి ఇందుమతి పాత్ర చేసిన మాలతి గారికి మాత్రం హీరోయిన్ గా నటించేందుకు తర్వాత అవకాశాలు రాలేదు. ఎందుకు అన్న విషయంలో సినిమా రంగంలో కొన్ని మిస్టరీ గా ఉంటాయి. అలాంటి మిస్టరీ లలో ఈ విషయం కూడా ఒకటిగా మిగిలిపోవడం జరిగింది. ఇక పాతాళభైరవి సినిమా తర్వాత మాలతి గారికి హీరోయిన్ ఎలాంటి అవకాశాలు రాలేదు. అయినా కూడా ఆమె చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణిస్తారు అని నమ్మకంతోనే ఎదురు చూస్తూ ఉండేది అవకాశాలకోసం. ఆ తర్వాత కాళహస్తి మహత్యం అనే సినిమాలో రాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ సినిమా కూడా అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకుంది. అయినా కూడా మాలతి గారికి ఆ సినిమా అనంతరం కూడా మాలతి గారికి హీరోయిన్ గా అవకాశాలు రాలేదు.

వచ్చిన అవకాశాలన్నీ కూడా అక్క లేదా వదిన పాత్రలు.. కొందరు అయితే తల్లి పాత్రలో కూడా నటించమని అడగడం జరిగింది. దీనితో ఆమె షాక్ కు గురి అయ్యింది. నేను పాతాళ భైరవి లో అంత మంచి పాత్రలు తీసిన కూడా నన్ను ఇలాంటి పాత్రలు చేయమంటున్నారు ఏమిటి అని ఇబ్బందికి గురి అయి… అప్పటికి కూడా చిత్ర పరిశ్రమను వదిలిపెట్టకుండా హీరోయిన్ అవకాశాలు ఎప్పటికైనా వస్తాయనే నమ్మకంతో ఎదురు చూసింది. చివరికి ఆర్థిక సమస్యల వల్ల వచ్చిన అవకాశాలు వదిలి పెట్టడం ఎందుకు అని వచ్చిన తల్లి పాత్రలు వదిన పాత్రలు కూడా చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలి రావడం జరిగింది. అప్పటికి మాలతి గారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అయినా కూడా హీరోయిన్ గా అవకాశాలు రాకపోతే అని చెన్నై నుంచి హైదరాబాద్ కు రావడం జరిగింది. డాబా ఇళ్ళల్లో అయితే అద్దె ఎక్కువగా ఉంటుందని పూరిగుడిసెలో ఒంటరిగా ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూసింది మాలతి.

అప్పటిలో చిన్న చిన్న వేషాలు కూడా మాలతి గారు వేయడం జరిగింది. చివరికి ఆమె పరిస్థితి ఎలా అయిందంటే జూనియర్ ఆర్టిస్ట్ కంటే అధ్వానంగా మారింది. కానీ ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడున్న సహాయ కార్యక్రమాలు అన్ని అప్పటిలో లేవు. ఇలాంటి పరిస్థితిలో అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నది ఎవరో కాదు ఎన్టీఆర్ గారు. అప్పుడు మాలతి గారు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి సహాయం అడిగితే చేసి ఉండేవాడా లేక ఆ అవకాశం లేక ఆమె అలాగే ఉండిపోయింది అన్నది అర్థం. ఇక ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో ఆమె పూరి గుడిస కూలిపోయింది. దీంతో అక్కడికక్కడే ఆమె మరణించింది. తీరా ఎవరు ఈమె అనే ఆరాధిస్తే ఒకప్పుడు సినిమాల్లో నటించిందంటా అని మాత్రమే తెలుసు. పెద్ద సూపర్ హిట్ సాధించిన పాతాళభైరవి సినిమాలో హీరోయిన్ గా నా కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. చనిపోయినప్పుడు చివరికి ఎవరు కూడా సంతాపసభ కూడా జరగలేదు, చివరికి ఎన్టీఆర్ గారు కూడా… సినిమా రంగాలలో చాలా వరకూ ఇలాంటి పరిస్థితి పరిస్థితులు అందరికీ కలచివేసింది.



























