Subbaraya Sharma : తెలుగు బుల్లితెర, వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించిన ఉప్పులూరి సుబ్బరాయ శర్మ గారిది విజయవాడ. హై స్కూల్ సమయం నుండే నాటక రంగ ప్రవేశమున్న సుబ్బరాయ శర్మ గారికి జంధ్యాల గారు జూనియర్. ఇక స్కూల్ సమయంలో జంధ్యాల గారు, సుబ్బరాయ శర్మ గారు, సుత్తి వీరభద్ర రావు గారు కలిసి నాటకాల్లో పాల్గొనేవారట. ఇక దూరదర్శన్ లో పలు నాటకాలు వేసిన సుబ్బరాయ శర్మ ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు.

ఎన్టీఆర్, రాజమౌళి సినిమాలో అవకాశం ఎలా పోయిందంటే…
ఇక నలుగురు దర్శకులు తనకు సినిమాల్లో మంచి అవకాశాలు ఇచ్చారని శర్మ గారు చెప్పారు. మొదట దాసరి గారి సినిమాలో అవకాశం వచ్చినా, వెళ్లే సమయానికి సౌత్ ఇండియా సినిమా మొత్తం స్ట్రైక్ లో ఉండడంతో ఆ సినిమా చేయలేక పోయాను. ఇక ఆ తరువాత జంధ్యాల గారి సినిమాలో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఎస్వి కృష్ణా రెడ్డి గారి దర్శకత్వంలో యమలీల, మాయలోడు, శుభలగ్నం, వంటి సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక రాఘవేంద్ర రావు గారితో పరిచయం వల్ల రాజమౌళి గారితో పరిచయం ఏర్పడి, ఆయన తీసిన యాడ్ లలో నటించడం జరిగింది.

ఇక స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీయాలనుకున్నపుడు హీరో తండ్రి పాత్ర నాకు ఇచ్చారు కానీ అదే సమయానికి నేను నా కూతురు డెలివరీ కోసం అమెరికా వెళ్లాల్సి రావడంతో ఆ పాత్ర పోయింది. ఇక మళ్ళీ తిరిగి వచ్చాక అదే సినిమాలో జడ్జి పాత్ర చేసాను. ఇక మొదట ఒక్క సన్నివేశమే అనుకున్నా రాజమౌళి గారి తండ్రి సలహా మేరకు పాత్ర నిడివి పెంచారు. ఇక ఆ తరువాత రాజమౌళి గారితో సింహాద్రి, మగధీర, బాహుబలి వంటి సినిమాలో మంచి పాత్రలు చేసారు శర్మ గారు. ఇక సింహాద్రి సినిమాలో పంతులు పాత్ర ద్వారా బాగా పేరు రావడంతో మళ్ళీ చాలా సినిమాల్లో అదే పంతులు పాత్రలు రావడంతో చేయనని చెప్పారట. ఆ పాత్రకు నటించే స్కోప్ లేనప్పుడు చేయడం ఎందుకు అని భావించారట. సినిమాలో చిన్న పాత్ర అయినా నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర చేయాలని భావించి అలాంటి పాత్రలే చేసానని మళ్ళీ పంచాక్షరీ సినిమాలో పంతులు పాత్ర చేసాను అని చెప్పారు.
































