బుల్లితెరపై ‘సుడిగాలి’ సుధీర్, రష్మీ జంటకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా ఈ జోడీ ఇంతటి క్రేజ్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి గురించి వచ్చిన రూమర్స్, గాసిప్స్ అన్నీ, ఇన్నీ కావు. టీవీ ప్రొగ్రామ్స్ లో తెగ సందడి చేస్తోన్న ఈ జంట.. మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తూ నిత్యం గాసిప్స్ లో వుంటూనే ఉన్నారు. దాదాపు 7 సంవత్సరాల నుండి వీళ్ళిద్దరూ సహ జీవనం చేస్తున్నట్లుగా తెగ బిల్డప్ ఇస్తున్నారు.

అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా గత 4 నెలలు నుండి షూటింగ్స్ నిలిపి వేయడంతో అన్ని సినిమా షూటింగ్స్, సీరియల్స్ షూటింగ్స్ తో పాటు జబర్దస్త్ షో కూడా ఆగిపోయింది. దీంతో ఆర్టిస్టులంతా ఇళ్లకే పరిమితం అయ్యి మధ్య మధ్యలో సోషల్ మీడియాలో నెటిజన్లను కూడా పలకరిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ బ్యూటీ రష్మీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు బదులిస్తోంది. ఇష్టమైన వ్యక్తి ఎవరు.? నచ్చిన ఫుడ్ ఏమిటి.? ఇలా అన్ని రకాలు ప్రశ్నలను రష్మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఈ క్రమంలో ఓ ఫ్యాన్స్ మాత్రం “సుడిగాలి సుధీర్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తారూ.?” అని అడిగాడు. ఈ ప్రశ్నకు బదులిస్తూ ఈ జబర్దస్త్ భామ… “సుధీర్ తో కలిసి పని చెయ్యడం ఓ అద్భుతం” అంటూ బదులిచ్చింది.

ఇదిలా వుండగా రష్మీ, సుధీర్ డేటింగ్ లో ఉన్నారని… వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని గతంలో రూమర్లు కూడా వచ్చాయి. కానీ వీటిని పూర్తిగా ఖండిస్తే అటు బుల్లితెరపై ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వదని.. ఒకవేళ అదే నిజమని చెప్తే ఫ్యూచర్ లో లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయనే ముందు జాగ్రత్తతో ఆ రూమర్స్ ను అలా మెయింటైన్ చేస్తూనే ముందుకు దూసుకు వెళ్తున్నారు ఈ జోడి. తాజాగా వీళ్ళిద్దరూ కూడా వెండితెరపై తమని తాము నిరూపించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దర్నీ కలిసి వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. ఫ్యాన్స్ కోరిక త్వరలోనే నెరవేరే అవకాశం ఇప్పుడొచ్చిందని టాలీవుడ్ సమాచారం. ఈమధ్య కాలంలో సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని శేఖర్ రాజు నిర్మించాడు. ఆ సినిమా సమయంలోనే సుధీర్ – రష్మీ జోడీగా ఒక సినిమా ప్లాన్ చేయాలనుందని అన్నాడు. ఆయనే ఇప్పుడు సుధీర్ – రష్మీ కాంబినేషన్లో ఒక రొమాంటిక్ మూవీని నిర్మించడానికి రంగంలోకి దిగినట్టుగా తెలిసింది. ఇక వెండితెరపై వీళ్ళిద్దరూ కలిసి చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.



























