Sukshmadarshini: సినిమాలు సక్సెస్ అవ్వాలి అంటే వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరో హీరోయిన్లు స్టార్ డైరెక్టర్లు పనిచేస్తేనే కాదు మనం చేసే సినిమాలో కంటెంట్ ఉంటే తప్పనిసరిగా అది చిన్న సినిమా అయినా పెద్ద ఆదరణ లభిస్తుందని చెప్పాలి. ఇలా ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకొని నిరూపించాయి. ఇలాంటి ఒక చిన్న సినిమాని ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్ అందుకొని సంచలనం సృష్టించిందని చెప్పాలి.

కేవలం ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఏకంగా 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. మరి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..నజ్రియా నజీమ్, బాసిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సూక్ష్మదర్శిని’. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి కలెక్షన్లను రాబట్టి మిస్టరీ, థ్రిల్లర్ సీన్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
ఇలా ఈ సినిమా థియేటర్ లో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమాని థియేటర్లో మిస్ అయిన వారు ప్రస్తుతం ఓటీటీలో చూడటం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జనవరి 11వ తేదీ నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుందని చెప్పాలి ఇక థియేటర్లో మిస్ అయిన వారు వెంటనే ఓటీటీలో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు.



























